https://oktelugu.com/

Bigg Boss 5 Telugu Elimination: ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ యమ రంజుగా సాగుతోంది. తాజాగా రెండో వారం వీకెండ్ కు వచ్చింది. మొత్తం 19మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించిన కింగ్ నాగార్జున ఈసారి 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. తొలి వారం ఎలిమినేషన్ ఇప్పటికే ముగిసిపోగా ఇప్పుడు రెండో వారానికి వచ్చేసింది. తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 19, 2021 / 12:31 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu Elimination: బిగ్ బాస్ యమ రంజుగా సాగుతోంది. తాజాగా రెండో వారం వీకెండ్ కు వచ్చింది. మొత్తం 19మందిని బిగ్ బాస్ ఇంట్లోకి పంపించిన కింగ్ నాగార్జున ఈసారి 5 మచ్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారెంటీ అన్నట్టుగా హింట్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే హౌస్ లో కంటెస్టెంట్లు రచ్చ చేస్తున్నారు. తొలి వారం ఎలిమినేషన్ ఇప్పటికే ముగిసిపోగా ఇప్పుడు రెండో వారానికి వచ్చేసింది. తొలి వారం బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎలిమినేషన్ ఎవరయ్యింది తెలిసిపోయింది.

    రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఈరోజు రాత్రి జరుగనుంది.. ప్రముఖులు ఈ వారం నామినేషన్ లో ఉన్నారు.    ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతున్నారనే విషయం తాజాగా లీక్ అయ్యింది. ఈరోజు ఎపిసోడ్ నిన్న షూటింగ్ చేస్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేషన్ అయ్యింది ఎవరో లీక్ అయిపోయింది.

    ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం ఏడుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఆనీ మాస్టర్, ప్రియ, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.

    బిగ్ బాస్ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన రెండో పోటీదారు  నటి ఉమా దేవి(Uma Devi)గా తెలుస్తోంది. ఈమె ప్రజల నుండి పెద్దగా ఓటింగ్ సంపాదించలేదు. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఈ వారం ఎలిమినేట్ అవుతోంది. అందరికంటే ఎక్కువగా లోబోకు ఓట్లు రాగా.. ప్రియాంక సింగ్ రెండో స్థానంలో ఉంది. ఇక అందరికంటే తక్కువగా ఉమకు ఓట్లు వచ్చాయి. ఈమె తర్వాత తక్కువగా నటరాజ్ మాస్టర్ కు ఓట్లు పడ్డాయి.

    గత వారం ఏడుగురు పోటీదారులు ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయబడ్డారు. అందరిలోకి ఉమా దేవికి తక్కువ ఓట్లు వచ్చాయి. ఇక హౌస్ లో బూతులు మాట్లాడడం.. అందరిపై ఒంటికాలిపై లేచి గొడవ పెట్టుకోవడం చాలా మైనస్ అయ్యింది. బూతులు మాట్లాడినందుకు నిన్న నాగార్జున సైతం ఆమెతో క్షమాపణలు చెప్పించి గుంజీలు తీయించాడు. హౌస్ లో ఆమె ప్రవర్తన బాగా లేదని ప్రేక్షకులకు తోటి కంటెస్టెంట్లకు తెలిసింది. ఈ క్రమంలోనే తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ఈవారం ఉమాదేవి ఎలిమినేట్ అయిపోయింది.

    ఈ వీకెండ్ లో బిగ్ బాస్ కు జోష్ వచ్చింది. సీనీ ప్రముఖ అతిథులు రాంచరణ్, నితిన్, తమన్నాలు ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోకి వచ్చి సందడి చేశారు. తెలుగు మార్కెట్ కోసం డిస్నీ+హాట్‌స్టార్ ఓటీటీ యాప్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రమోషన్‌ లో భాగంగా రామ్ చరణ్ బిగ్ బాస్ షోకు హాజరయ్యారు. నితిన్, నభా నటేష్ , తమన్నా కూడా తమ తాజా చిత్రం ‘మాస్ట్రో’ ప్రమోషన్ కోసం షోకు హాజరై సందడి చేశారు.