https://oktelugu.com/

Tamannaah: ఆ బిజినెస్ మెన్ తో తమన్నా పెళ్లి !

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ మిల్క్ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా హీరోయిన్ గా కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్నా.. తమన్నాకి మాత్రం సినిమాలు తగ్గలేదు. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ […]

Written By:
  • Shiva
  • , Updated On : February 17, 2022 / 11:00 AM IST
    Follow us on

    Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇండస్ట్రీకి వచ్చి దగ్గర దగ్గరగా రెండు దశాబ్దాలు అవుతుంది. అయినా, ఇప్పటికీ మిల్క్ బ్యూటీకి ఫుల్ క్రేజ్ ఉంది. పైగా హీరోయిన్ గా కూడా ఫుల్ ఫామ్ లో ఉంది. యంగ్ బ్యూటీస్ రష్మిక, పూజా హెగ్డే, కీర్తి సురేష్, కృతి శెట్టి, కేతిక శర్మ లాంటి కొత్త భామలు వరుస అవకాశాలతో రెచ్చిపోతున్నా.. తమన్నాకి మాత్రం సినిమాలు తగ్గలేదు. చిరంజీవి, వెంకటేష్ వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటిస్తూ కెరీర్ ను ఇంకా కొనసాగిస్తూనే ఉంది.

    Tamannaah

    మరోపక్క తమన్నాతో పాటు హీరోయిన్ గా వచ్చిన శ్రీయా, కాజల్ లాంటి హీరోయిన్లు ఆల్ రెడీ పెళ్లి చేసుకుని.. పిల్లల ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు. కానీ, తమన్నా మాత్రం ఇంకా మేకప్ పూసుకుంటూ.. తనకు సినిమాలే సరదా అంటూ కాలక్షేపం చేస్తోంది. నిజానికి గత మూడేళ్ళ నుంచే తమన్నా.. మంచి సంబంధం కోసం చూస్తోందట. కానీ, ఎందుకో తనకు తగ్గ సంబంధం దొరకడం లేదట.

    Also Read:  సినీ తారల తాజా ఇంట్రెస్టింగ్ పోస్ట్ లు

    అసలు తనకు ఎందుకు పెళ్లి సెట్ అవ్వడం లేదో అంటూ తమన్నా తెగ ఫీల్ అయిపోయింది కూడా. ఎఫ్ 3 షూట్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ బ్యూటీ, తన పెళ్లి గురించి ప్రస్తుతం సీరియస్ గా ఆలోచిస్తోంది. ఈ క్రమంలోనే మిల్కీ బ్యూటీ సంబంధాలు చూస్తోంది. లైఫ్ లో సెటిల్ అవ్వడం ఎంత ముఖ్యమో.. పెళ్లి కూడా అంతే ముఖ్యం అని మొత్తానికి తమన్నా పెళ్ళికి రెడీ అయ్యింది.

    Tamannaah

    ఇంతకీ మిల్కీ బ్యూటీ ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకోబోతుంది. ఆమె భర్తకు ముంబైలో రెస్టారెంట్లు ఉన్నాయట. అన్ని సెట్ అయితే, త్వరలోనే తమన్నాకి ఆ రెస్టారెంట్ ఓనర్ తో పెళ్లి జరుగుతుంది. ఏది ఏమైనా పెళ్లి తర్వాత కూడా తమన్నా సినిమాలు చేసుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది. ఎలాగూ శ్రీయా, స్నేహ, ప్రియమణి, సమంత లాంటి హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్నారు.

    గా కొత్తగా ఈ లిస్ట్ లోకి కాజల్ కూడా చేరనుంది. అందుకే.. నేను కూడా అలాగే చేస్తాను అంటూ తమన్నా మొత్తానికి తన ఫ్యామిలీ మెంబర్స్ కి క్లారిటీ కూడా ఇచ్చింది. కాబోయే భర్త కూడా నీ ఇష్టం అంటూ భరోసా ఇచ్చాడు కాబట్టి.. ఇక పెళ్లి చేసుకోవాలని తమన్నా ప్లాన్ చేసుకుంది.

    Also Read:  నిన్న‌టి దాకా చెత్త ఏరుకునే వ్య‌క్తి.. నేడు పెద్ద మోడ‌ల్‌.. ల‌క్ అంటే ఇదే..!

    Tags