https://oktelugu.com/

Hey Sinamika Trailer: ‘హేయ్ సినామికా’ అంటూ ట్రైలర్ వదిలిన మహేష్ బాబు !

Hey Sinamika Trailer: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘హేయ్ సినామికా’ ట్రైలర్‌ ను ప్రిన్స్ మహేశ్‌ బాబు లాంఛ్ చేశాడు. ట్రైలర్ విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, చిత్రయూనిట్‌కు అభినందనలంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బృందగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో దుల్కర్‌ సరసన కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ నటించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కానుంది. కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 17, 2022 / 11:08 AM IST
    Follow us on

    Hey Sinamika Trailer: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘హేయ్ సినామికా’ ట్రైలర్‌ ను ప్రిన్స్ మహేశ్‌ బాబు లాంఛ్ చేశాడు. ట్రైలర్ విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని, చిత్రయూనిట్‌కు అభినందనలంటూ మహేశ్‌బాబు ట్వీట్ చేశాడు. బృందగోపాల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో దుల్కర్‌ సరసన కాజల్ అగర్వాల్, అదితీరావు హైదరీ నటించారు. ఈ సినిమా మార్చి 3న రిలీజ్ కానుంది.

    Hey Sinamika Trailer

    కాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ది వెరీ డిఫరెంట్ పాత్ర అని తెలుస్తోంది. అలాగే అదితీరావు హైదరీ కూడా తనకు భిన్నమైన పాత్రలో నటిస్తోందట. ఇక ఈ సినిమాకి గోపీ వసంత్ సంగీతం అందించాడు. ఆ మధ్య ఈ సినిమాలోని కాజల్‌ పాటను ప్రభాస్‌ విడుదల చేయడం ఆసక్తి క్రియేట్ చేసింది.

    Also Read:   యాక్షన్ మోడ్ లో ఉన్న ‘సర్కారు వారి పాట’

    ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడంతో సినిమా జనాల్లోకి బాగా వెళ్తుంది. పైగా ప్రముఖ నృత్య దర్శకురాలు బృంద మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. దానికి తోడు ‘హేయ్ సినామికా’ అంటూ టైటిల్ ను కూడా చాలా కొత్తగా పెట్టారు. అందుకే.. సినిమా పేరు వినగానే రిజస్టర్ అయిపోతుంది.

    Hey Sinamika Trailer

    మలయాళ ఇండస్ట్రీలో దుల్కర్ సల్మాన్ స్టార్ హీరో కాబట్టి.. అక్కడ ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ వచ్చేలా ఉన్నాయి. అలాగే తెలుగు ఇండస్ట్రీలో కూడా దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇక్కడ కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక అదితిరావు హైదరీ వల్ల ఈ సినిమాకి హిందీలో కూడా మార్కెట్ కానుంది.

    Also Read:  ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాళ్లు వీరే!

    Tags