CM KCR Birthday: కేసీఆర్ బర్త్ డే స్పెషల్: 68వ వసంతంలోకి టీఆర్ఎస్ బాస్

CM KCR Birthday: పేద‌రికంలో పుట్ట‌డం త‌ప్పు కాదు పేద‌రికంలో చావ‌డం త‌ప్పు అని ఓ సామెత‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంఇ వ‌చ్చినా ఆయ‌న ఎదిగిన తీరు చూస్తే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చివ‌ర‌కు తాను అనుకున్న‌ది మాత్రం సాధించారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా త‌ట్టుకుని ఎదురు నిలిచిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ సొంత ఊరు మెద‌క్ జిల్లాలోని చింత‌మ‌డ‌క‌. ఇంకా […]

Written By: Srinivas, Updated On : February 17, 2022 11:10 am
Follow us on

CM KCR Birthday: పేద‌రికంలో పుట్ట‌డం త‌ప్పు కాదు పేద‌రికంలో చావ‌డం త‌ప్పు అని ఓ సామెత‌. తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంఇ వ‌చ్చినా ఆయ‌న ఎదిగిన తీరు చూస్తే మ‌న‌కు అర్థ‌మ‌వుతుంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా చివ‌ర‌కు తాను అనుకున్న‌ది మాత్రం సాధించారు. తెలంగాణ ఉద్య‌మంలో ఎన్ని క‌ష్టాలు వ‌చ్చినా త‌ట్టుకుని ఎదురు నిలిచిన సంగ‌తి తెలిసిందే. కేసీఆర్ సొంత ఊరు మెద‌క్ జిల్లాలోని చింత‌మ‌డ‌క‌. ఇంకా వారి పాత ఊరు ఎగువ మానేరు డ్యాంలో పోవ‌డంతో చింత‌మ‌డ‌క‌కు వ‌ల‌స వ‌చ్చి స్థిర‌ప‌డ్డారు.

CM KCR Birthday

సిద్దిపేట‌లో బీసీ చ‌దివిని ఆయ‌న ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యంలో ఎంఏ చ‌దివారు. త‌న వాగ్దాటితో అంద‌రిని మెప్పించ‌గ‌ల కేసీఆర్ స్థానిక భాష‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌తారు. మ‌న ప్రాంత ప‌దాలు వాడుతూ భాష వ్య‌క్తీక‌ర‌ణ‌లో అంద‌రిని ఆక‌ట్టుకుంటారు. దీంతోనే ఆయ‌న భాష‌కు అంద‌రు జై కొడ‌తారు. తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న త‌న భాష‌తోనే అంద‌రిని త‌న వైపు తిప్పుకున్నారు. ఇలా తెలంగాణ ఉద్య‌మాన్ని అంచెలంచెలుగా ఎదిగింది.

2001లో తెలంగాణ రాష్ట్ర స‌మితి పేరుతో పార్టీని స్థాపించి అధికారం లేకున్నా ప‌ద్నాలుగేళ్లు పార్టీని న‌డిపించారు. కాంగ్రెస్ తో జ‌త‌క‌ట్టి కేంద్ర‌మంత్రిగా కూడా త‌న‌దైన పాత్ర పోషించారు. అప్ప‌టి సీనియ‌ర్ నేత ఎం. స‌త్య‌నారాయ‌ణ రావు విసిరిన స‌వాలును స్వీక‌రించి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి దాదాపు ల‌క్ష‌కుపైగా ఓట్ల‌తో స‌మాధానం చెప్పి తెలంగాణ ప్రజ‌ల ఆకాంక్ష‌ను వారికి తెలియ‌జేశారు. దీంతో స్థానిక ఎన్నిక‌ల్లో కూడా త‌న‌దైన స‌త్తా చాటి టీఆర్ఎస్ కు తిరుగులేద‌ని నిరూపించారు.

సీనియ‌ర్ నేత ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరి వారి ప్ర‌భుత్వంలో ర‌వాణా శాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు. చంద్ర‌బాబు హ‌యాంలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌లేద‌నే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీ రూప‌క‌ల్ప‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ స‌హ‌కారంతో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన‌ట్లు తెలుస్తోంది. అలా ప్రారంభ‌మైన పార్టీ త‌న ప్ర‌భావాన్ని రాష్ట్ర‌మంత‌టా వ్యాపించి ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసింది.

Also Read: KCR Politics: తెలంగాణలో ‘ముందస్తు ఎన్నికల’ ఊహాగానాలు!? కేసీఆర్ లొల్లికి కారణమదే?

ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కూడా త‌న‌దైన ముద్ర పోషిస్తున్నారు. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, క‌ల్యాణ ల‌క్ష్మి, రైతుబంధు, ద‌ళిత బంధు లాంటి ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల మ‌న‌సులు గెలుచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్లో మ‌రో ప‌థ‌కం తీసుకొచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. రెండు సార్లు త‌న వాక్చాతుర్యంతోనే పార్టీని ముందుండి న‌డిపించారు. భ‌విష్య‌త్ లో కూడా పార్టీకి దిశానిర్దేశం చేసే ప‌నిలో ప‌డిపోయిన‌ట్లు తెలుస్తోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక‌లో ఎదురైన చేతు అనుభ‌వంతో బీజేపీని టార్గెట్ చేసుకుని దానిపై విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ల‌క్ష్యంగా చేసుకుని మూడో కూట‌మి ఏర్పాటుకు రూప‌క‌ల్ప‌న చేస్తున్నారు. ఇందులో భాగంగానే త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ప‌శ్చిమ‌బెంగాల్ సీఎంలు స్టాలిన్, విజ‌య‌న్, మ‌మ‌తా బెన‌ర్జీల‌ను క‌లుస్తున్నారు థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ప్రాముఖ్య‌త‌ను తెలియ‌జేస్తూ జాతీయ రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర వేయాల‌ని చూస్తున్నారు. వ‌చ్చే లోక్ సభ ఎన్నిక‌ల్లో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌జాఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించి ముందుకు న‌డుస్తున్నారు.

Also Read: KCR-Chinna Jeeyar Swamy: చిన్న జీయ‌ర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు త‌ప్ప‌వా?

Tags