Actress played both heroine and mother to Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీ నందమూరి బాలకృష్ణ (Balakrishna) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఎన్టీఆర్ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య…కెరియర్ మొదట్లో చాలా సాఫ్ట్ సినిమాలు చేసినప్పటికి ఆ తర్వాత మాస్ సినిమాలను చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికి మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో బాలకృష్ణ కూడా ఒకరు కావడం విశేషం… ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలను సాధించిన ఆయన ఇక మిత్రులు చేయబోయే సినిమాలతో కూడా సూపర్ సక్సెస్ లను సాధించాలనే ప్రయత్నంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో అఖండ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఒక గ్లింప్స్ అయితే వచ్చింది. ఆ గ్లింప్స్ లో బాలయ్య తన నట విశ్వరూపం చూపించినట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో బాలయ్య మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే నటులు కొంతమంది ఉన్నారు. అయినప్పటికి బాలయ్య బాబు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు రంజింపజేస్తూ వస్తున్నాడు… ఇక ఇదిలా ఉంటే బాలయ్య ఒకప్పుడు ఒక స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేశాడు. ఆ హీరోయిన్ తో సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. అలాంటి హీరోయిన్ ఆ తర్వాత కాలంలో బాలయ్యకు తల్లిగా నటించిందని విషయం మనకు తెలిసిందే…
Also Read: విడుదలకు ముందే ప్రభంజనం..అక్షారాలా 500 బెనిఫిట్ షోస్..’వార్ 2′ క్రేజ్ మామూలుగా లేదుగా!
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అంటే సుహాసిని…’మంగమ్మగారి మనవడు’ (Mangamma gari Manavaadu) సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా సుహాసిని నటించింది. వీళ్ళిద్దరి కాంబినేషన్ కి మంచి గుర్తింపు అయితే వచ్చింది. అలాగే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది… ఇక బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లెజెండ్ (Legend) సినిమాలో సుహాసిని బాలకృష్ణకు తల్లిగా నటించింది.
మరి ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరిది బెస్ట్ కాంబినేషన్ గా ఆన్ స్క్రీన్ మీద నిలిచింది. కానీ తల్లిగా నటించడం అనేది కొంతమంది ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అయితే తల్లి కొడుకులుగా సుహాసిని బాలయ్య మధ్య ఉండే సీన్లు అయితే లేవు. బాలయ్య చిన్నతనంలో ఉన్నప్పుడే లెజెండ్ సినిమాలో సుహాసిని గారు చనిపోతారు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ పై హైకోర్టులో కేసు నమోదు..కారణం ఏమిటంటే!
కాబట్టి ఇద్దరి మధ్య తల్లి కొడుకులు అనిపించేంత ఎమోషనల్ పలికించే సన్నివేశాలు అయితే లేకపోవడం వల్ల జనాలు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. లేకపోతే మాత్రం ఆ సన్నివేశాలు ఉంటే జనాలు చాలా వరకు ఇబ్బంది పడేవారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…