Chiranjeevi-Anil Ravipudi Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కానీ రీతిలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నారు అందులో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మొదటి స్థానంలో ఉంటాడు… గత 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్న చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడు కూడా పాన్ ఇండియా సినిమాను చేసి సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవి లాంటి నటుడు సంక్రాంతి బరిలో నిలిచాడు అంటే మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ గా నిలుస్తోంది అనే ఒక నమ్మకం అయితే తమ అభిమానుల్లో ఉంది. ఇలాంటి సందర్భంలోనే 2023 వ సంవత్సరంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో సంక్రాంతి విన్నర్ గా నిలిచాడు. ఇక మరోసారి 2026వ సంవత్సరంలో అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను శరవేగంగా పూర్తి చేసిన సినిమా యూనిట్ మరో రెండు నెలల్లో సినిమాని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా సంక్రాంతికి మరొక ఆరు నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఆరు నెలల్లో సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సంక్రాంతి విన్నర్ గా నిలిస్తే చిరంజీవికి ఎదురు ఉండదనే చెప్పాలి. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ‘ సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో అనిల్ రావిపూడి ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు.
Also Read: ‘హరి హర వీరమల్లు’ మేకర్స్ పై హైకోర్టులో కేసు నమోదు..కారణం ఏమిటంటే!
మరి తను అనుకున్నట్టుగానే ఆ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించడంతో ఇప్పుడు చిరంజీవితో చేస్తున్న సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరొకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ఇప్పటికే చిరంజీవి చేసిన ‘భోళా శంకర్ ‘ (Bhola Shankar) సినిమా ఆశించిన మేరకు విజయాన్ని అయితే సాధించలేదు. ఈ సినిమాతో బ్యాడ్ నేమ్ ని మూటగట్టుకొని చిరంజీవి రాబోయే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించి మరోసారి మెగాస్టార్ గా తన పవర్ చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read: విడుదలకు ముందే ప్రభంజనం..అక్షారాలా 500 బెనిఫిట్ షోస్..’వార్ 2′ క్రేజ్ మామూలుగా లేదుగా!
తన తోటి హీరోలందరూ వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే చిరంజీవి మాత్రం కొంతవరకు వెనకబడిపోతున్నాడనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమా తనను మరోసారి మాస్ హీరోగా నిలబెడుతుందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…