https://oktelugu.com/

Sruthi hasan: శృతిహాసన్​కు తనలో నచ్చని విషయం ఏంటో తెలుసా?

Sruthi hasan: తన అందం, అభినయాలతో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్​. తండ్రి కమల్​హాసన్​ ప్రముఖ నటుడు అయినప్పటికీ.. ఎప్పడూ ఆయన పేరును ఉపయోగించుకోకుండా.. స్వశక్తితో తన కాళ్లపై నిలబడి జీవితంలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తనలో తనకు నచ్చేది నిజాయితీ అని చెప్పింది. తనను ఎప్పటికీ సంతోషంగా ఉంచే విషయం ఇదేనని స్పష్టం చేసింది. జీవితంలో ఆటుపోట్లు ఎదురవ్వగానే కంగారు పడిపోయే మనస్తత్వం తనది కాదని పేర్కొంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 25, 2021 / 05:22 PM IST
    Follow us on

    Sruthi hasan: తన అందం, అభినయాలతో సినీ ప్రేక్షకులను కట్టిపడేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్​. తండ్రి కమల్​హాసన్​ ప్రముఖ నటుడు అయినప్పటికీ.. ఎప్పడూ ఆయన పేరును ఉపయోగించుకోకుండా.. స్వశక్తితో తన కాళ్లపై నిలబడి జీవితంలో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే తనలో తనకు నచ్చేది నిజాయితీ అని చెప్పింది. తనను ఎప్పటికీ సంతోషంగా ఉంచే విషయం ఇదేనని స్పష్టం చేసింది. జీవితంలో ఆటుపోట్లు ఎదురవ్వగానే కంగారు పడిపోయే మనస్తత్వం తనది కాదని పేర్కొంది. చేసిన పనిలో తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించి.. వాటిని సరిదిద్దుకుంటానని తెలిపింది. తప్పు అనగానే ఎదుటివాళ్లవైపు మన వేళ్లను చూపిస్తామని.. కానీ తను మాత్రం తన వైపు నుంచే మొదలు పెడతానంది. తనను తాను ఆత్మ విమర్శ చేసుకున్నాకే.. మిగిలిన విషయాల గురించి ఆలోచిస్తానని శృతిహాసన్​ చెప్పుకొచ్చింది. ఈ విధంగా నిజాయితీగా ఆలోచించడం వల్ల ప్రతీరోజూ ఓ అందమైన పాఠం నేర్చుకుంటానని పేర్కొంది.

    ప్రస్తుతం శృతిహాస్​ ప్రభాస్​తో కలిసి సలార్​ మూవీలో నటిస్తోంది.  ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో భారీ బడ్జెట్​లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇటీవలే చిత్రానికి సంబంధించిన ఓ వీడియో సోషల్​మీడియాలో వైరల్​ అయ్యింది. ప్రభాస్​పై యాక్షన్​ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న ఓ వీడియోను ఫ్యాన్​ ఒకరు తీసి సామాజిక మాధ్యమంలో పోస్ట్​ చేశారు. కొద్ది సేపట్లోనే దీనిపై అనేక స్పందనలు వచ్చాయి. ఇక, సింగర్​, యాక్టర్​, మోడల్​గా లిరికిస్ట్​ ఇలా ఎన్నో కళలు నిండిన నటి శృతిహాసన్​. గతంలో వచ్చిన సినిమాల్లో ఎలా విజయం సాధించిందో.. ఈ చిత్రంతో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని శృతి అభిమానులు ఆశిస్తున్నారు.