Sriya Saran: అదిరిపోయే సీక్రెట్ రివీల్ చేసిన శ్రీయ… షాక్ లో అభిమానులు ?

Sriya Saran: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి శ్రీయ సరన్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు … యంగ్ హీరో లతో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్లుగా తన ఫిజిక్ కాపాడుకుంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. కాగా 2018 లో తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రీయ… ప్రస్తుతం భర్తతో కలిసి […]

Written By: Raghava Rao Gara, Updated On : October 12, 2021 9:09 am
Follow us on

Sriya Saran: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నటి శ్రీయ సరన్. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ , వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు … యంగ్ హీరో లతో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. 19 ఏళ్లుగా తన ఫిజిక్ కాపాడుకుంటూ తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. కాగా 2018 లో తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రీయ… ప్రస్తుతం భర్తతో కలిసి ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది.

అయితే సెలబ్రిటీస్‌కు సంబంధించిన ఏ విషయమైనా కూడా ఎంత దాచేసినా క్షణాల్లోనే వైరల్ అయిపోతుంది. ఇలాంటి సమయంలో శ్రీయ మాత్రం చాలా పెద్ద సీక్రేట్ ను ఏడాది పాటు దాచేసింది. కనీసం చిన్న అనుమానం కూడా రాకుండా జాగ్రత్త పడింది. ఉన్నట్లుండి ఈ రహస్యం బయటికి చెప్పిన తర్వాత ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.

గతేడాది తాను పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికి షాకిచ్చింది శ్రీయ. 2020 లో కరోన కారణంగా ప్రపంచం అంతా స్థంభించిపోయింది. ఇలాంటి సమయంలోనూ తమ జీవితంలో మాత్రం అద్భుతం జరిగిందని తెలిపింది. గతేడాది వెకేషన్‌ కోసం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్‌ కారణంగా… అక్కడే లాక్ అయిపోయారు. ఏంజిల్‌ లాంటి చిన్నారిని తమకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటానంటూ తాను తల్లైన విషయాన్ని బయటపెట్టింది ఈ భామ. చిన్నారి రాకతో తమ ప్రపంచమే మారిపోయిందని ఆమె అంటుంది.