https://oktelugu.com/

Nagababu: మెగా బ్రదర్ నాగబాబు ‘మా’ రాజీనామా లేఖలో ఏం రాశారంటే?

Nagababu: ‘మా ’ ఎన్నికల్లో తను సపోర్టు చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో మనస్థాపం చెందిన నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక ఘాటు లేఖ పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. మా అసోసియేషన్ సభ్యులపై ఇందులో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా అసోసియేషన్ లో సభ్యులు కళాకారులుగా మనుషులుగా అనూహ్య మార్పులు చెందారని.. ఈ అసహ్యకరమైన మార్పులు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని వివరించారు. ప్రాంతీయవాదం, […]

Written By: , Updated On : October 11, 2021 / 10:15 PM IST
Follow us on

Nagababu: ‘మా ’ ఎన్నికల్లో తను సపోర్టు చేసిన ప్రకాష్ రాజ్ ఓడిపోవడంతో మనస్థాపం చెందిన నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన సోషల్ మీడియాలో ఒక ఘాటు లేఖ పోస్ట్ చేశారు. అది వైరల్ గా మారింది. మా అసోసియేషన్ సభ్యులపై ఇందులో నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Nagababu

మా అసోసియేషన్ లో సభ్యులు కళాకారులుగా మనుషులుగా అనూహ్య మార్పులు చెందారని.. ఈ అసహ్యకరమైన మార్పులు తనను ఆశ్చర్యానికి గురిచేశాయని వివరించారు. ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వ ధోరణులతో సభ్యులు ఎంతగా మారిపోయారో ఈ ఎన్నికలు తన లాంటి వారికి కనువిప్పు కలిగించాయని నాగబాబు తెలిపారు. ధన ప్రభావంతో అసోసియేషన్ సభ్యులు దారుణంగా దిగజారిపోయారని ఆరోపించారు.

హిపోక్రైట్స్, స్టీరియో టైప్ సభ్యుల కారణంగానే అసోసియేషన్ నుంచి తాను వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్టు నాగబాబు తెలిపారు. ప్రాంతీయతత్వం, మతతత్వాలతో అసోసియేషన్ సొంత గోతి తవ్వుకుంటున్నదని, అందుకే గుడ్ బై చెప్పడం అనివార్యమైందని వివరించారు.

ఇక ఓడిపోయినా సరే ప్రకాష్ రాజ్ వెంట తాను ఎల్లప్పుడూ నిలబడే ఉంటారని నాగబాబు స్పష్టం చేశారు. ఆయన ఎలాంటి సమస్యనైనా సత్తా గల అంచెంచల వ్యక్తి అని ప్రకాష్ రాజ్ ను నాగబాబు ప్రశంసించారు. అసోసియేషన్ భవిష్యత్ పై తాను ఆందోళన చెందుతున్నట్టు నాగబాబు లేఖలో సంచలన వ్యాఖ్యలు చేశారు.