https://oktelugu.com/

Shreya: దేవుడిచ్చిన గిఫ్ట్​తో ఎంజాయ్ చేస్తున్న శ్రియా!

Shreya: తెలుగు ఇడస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు లో హీరోయిన్ శ్రియ ఉంటారు. సంతోషం సినిమాతో విజయాన్ని అందుకుని ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు హిందీ తమిళ చిత్రాలతో నటించి తనకంటూ ప్రేక్షక అభిమానులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం వివాహం చేసుకుని తన భర్తతో కూతురితో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రియా 2018 లో రష్యాకు చెందిన ఆండ్రూ యువకుడిని వివాహం […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 9, 2021 / 05:57 PM IST
    Follow us on

    Shreya: తెలుగు ఇడస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు లో హీరోయిన్ శ్రియ ఉంటారు. సంతోషం సినిమాతో విజయాన్ని అందుకుని ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. తెలుగు హిందీ తమిళ చిత్రాలతో నటించి తనకంటూ ప్రేక్షక అభిమానులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ప్రస్తుతం వివాహం చేసుకుని తన భర్తతో కూతురితో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రియా 2018 లో రష్యాకు చెందిన ఆండ్రూ యువకుడిని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గత ఏడాది లాక్‌డౌన్‌లో బిడ్డ పుట్టిన విషయం చెప్పి అందరినీ షాక్ చేసింది శ్రియా. ఈ లాక్‌డౌన్‌ మాకు స్పెషల్ అతి పెద్ద గాడ్ గిఫ్ట్ రాధా అని సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేస్తూ ఆ పాపకి రాధా దాని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చింది.

    అయితే ఈ జంట అల్లరి చేస్తూ వెకేషన్ వెళ్లిన వీడియోస్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు ఇటీవల జరిగిన జి కుటుంబం అవార్డ్స్ వేడుకల్లో భర్త ఆండ్రూ, శ్రియల ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.పోయిన ఆదివారం తన బిడ్డతోసరదాగా గడుపుతున్న వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది శ్రియా..‌.ప్రస్తుతం ఈ వీడియో పై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ లో శ్రియా నటించారు. ఈ చిత్రం తర్వాత ఈ అమ్మడు సినిమాలలో మళ్లీ బిజీ అవుతుందో లేదో తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.