https://oktelugu.com/

LIGER: యునైటెడ్ స్టేట్స్ లో సందడి చేయనున్న “లైగ‌ర్ ” టీమ్​

LIGER: టాలీవుడ్ లో ఎందరో హీరోస్ కి వాళ్ల మార్కెట్ పెంచిన దర్శకుడుగా మాస్ లవ్ మిక్స్ చేసి తెరకెక్కించడంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ కి ఎవరు సాటిరారు అనే చెప్పాలి. అయితే గత రెండేళ్లుగా ఈ డైరెక్ట‌ర్ కి అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. హీరో విజ‌య దేవ‌ర‌కొండ తో” లైగ‌ర్ “సినిమా తో హిట్ కొట్టాలని కసితో ఉన్నారు పూరి. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం రౌడీ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ హాట్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 9, 2021 / 06:02 PM IST
    Follow us on

    LIGER: టాలీవుడ్ లో ఎందరో హీరోస్ కి వాళ్ల మార్కెట్ పెంచిన దర్శకుడుగా మాస్ లవ్ మిక్స్ చేసి తెరకెక్కించడంలో స్టార్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్ కి ఎవరు సాటిరారు అనే చెప్పాలి. అయితే గత రెండేళ్లుగా ఈ డైరెక్ట‌ర్ కి అదృష్టం కలిసి రావడం లేదనే చెప్పాలి. హీరో విజ‌య దేవ‌ర‌కొండ తో” లైగ‌ర్ “సినిమా తో హిట్ కొట్టాలని కసితో ఉన్నారు పూరి. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వం రౌడీ స్టార్ విజ‌య దేవ‌ర‌కొండ హాట్ బ్యూటీ అన‌న్య పాండే జంటగా నటిస్తున్న చిత్రం “లైగ‌ర్”ఈ మూవీకి పూరి జగన్నాథ్, ఛార్మి కౌర్ ,బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు, అయితే ఈ సినిమా లో అంత‌ర్జాతీయ న‌టుడు, బాక్సర్ మైక్ టైస‌న్ కీలక పాత్ర‌లో నటిస్తున్నారు.

    విజ‌య్ దేవ‌ర‌కొండ బాక్సర్ గా లుక్ లో కనిపించడం తో అభిమానుల లో ఈ సినిమా పై భారీ గా అంచ‌నాలు పెరుగుతున్నాయి బాహుబలి సినిమా తో ఫామ్ లోకి వచ్చిన ర‌మ్య‌కృష్ణ కుడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ముంబై లో పూర్తి చేసుకుంది బృందం ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారట యూనిట్ బృందం. అయితే నవంబర్ 12 నుండి అమెరికాలో షూటింగ్ షెడ్యూల్ ను ప్రారంభించ‌నున్నారు లైగ‌ర్” యూనిట్ సభ్యులు.ఈ సినిమా ను వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చూడాలి మరి ఈ ఏడాది విడుదల అవుతుందా లేదా వచ్చే ఏడాదిలో విడుదల అవుతుందా అనేది.