Shivani Rajasekhar: తెలుగు ఇండస్ట్రీలో హీరో రాజశేఖర్, జీవిత దంపతులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైనా ముక్కు సూటిగా ప్రశ్నించ గలిగే హీరోగా రాజశేఖర్ గుర్తింపు పొందారు. సినిమా తారలు తమ పిల్లలకు ఇచ్చే సంపద వారసత్వం సినిమాలే అనే చెప్పుకోవాలి. ఆయన మొదటి కుమార్తె శివాత్మిక “దొరసాని” చిత్రంతో, తమ రెండో కుమార్తె శివాని “అద్భుతం” సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. తేజ సజ్జా, శివానీ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అద్భుతం”. ఈ చిత్రం గత నెలలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదలైంది. ఇప్పుడు శివాని రాజశేఖర్ రెండో చిత్రం ‘డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ’ సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
Also Read: Saya Saya Song: రొమాంటిక్ ‘సయా’.. ఊహించిన దానికంటే బాగుంటుందట !
ఈ చిత్రాన్ని సోనీ లివ్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి దక్కించుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో ‘డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు’ (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ను చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ టైమ్ కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన దీనిలో అదిత్ అరుణ్ హీరోగా నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు విశేష ఆదరణ దక్కించుకున్నాయి. అతి త్వరలో ఈ చిత్రం సోనిలివ్‌లో ప్రసారం కానున్న సందర్భంగా నిర్మాత డా. రవి ప్రసాద్ మాట్లాడుతూ, ”మా ఫస్ట్ మూవీకి సురేష్ ప్రొడక్షన్స్ సమర్పకులుగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఓటీటీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్. సోనివంటి ఇంటర్నేషనల్ సంస్థతో అసోసియేట్ అవడం చాలా హ్యాపీ అని చెప్పారు. ఈ చిత్రంలో ప్రియదర్శి, వైవా హర్ష, దివ్య, రియాజ్ ఖాన్, సత్యం రాజేష్ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
Also Read: పాపం.. ఉప్మా సినిమాకు బిర్యానీ మాటలెందుకో ?