https://oktelugu.com/

Actress Samantha: అస్వస్థత కు గురైన నటి సమంత… ఆరోగ్య విషయంపై క్లారిటి ఇచ్చిన ఆమె మేనేజర్

Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని ఏ ఐ జి.. ఆస్పత్రిలో లో సమంత చేరినట్లు తెలుస్తోంది. నిన్న తిరుపతికి వెళ్లిన సమంత… అక్కడి వాతావరణానికి కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్త్ చెకప్ కోసం ఆమె హైదరాబాద్ లోని ఏ ఐ జి హాస్పిటల్ లో చేరినట్లు అనుకుంటున్నారు. కాగా సమంత ఆరోగ్యంపై ఆమె… మేనేజ‌ర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌ సమంత […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 13, 2021 / 06:00 PM IST
    Follow us on

    Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం అందుతోంది. హైదరాబాద్ లోని ఏ ఐ జి.. ఆస్పత్రిలో లో సమంత చేరినట్లు తెలుస్తోంది. నిన్న తిరుపతికి వెళ్లిన సమంత… అక్కడి వాతావరణానికి కాస్త అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హెల్త్ చెకప్ కోసం ఆమె హైదరాబాద్ లోని ఏ ఐ జి హాస్పిటల్ లో చేరినట్లు అనుకుంటున్నారు. కాగా సమంత ఆరోగ్యంపై ఆమె… మేనేజ‌ర్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్‌ సమంత చాలా ఆరోగ్యంగా ఉన్నారని… నిన్న కాస్తంత దగ్గు రావడం తో హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఏఐజీ ఆస్పత్రి లో పరీక్షలు చేయించుకున్నార‌ని ఆమె మేనేజ‌ర్ పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఆమె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోందని క్లారిటీ ఇచ్చారు.

    స‌మంత ఆరోగ్యం పై ఎలాంటి వదంతులు నమ్మవద్దని.. సమంత మేనేజర్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం స‌మంత ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. కాగా.. ఇవాళ ఉద‌యం నుంచి హీరోయిన్ స‌మంత ఆరోగ్యం పై వార్త‌లు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. స‌మంత‌.. ఏఐజీ ఆస్ప‌త్రి లో చేరింద‌ని.. ఆమె ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని.. వార్త‌లు వ‌చ్చాయి. జ్వ‌రం, వాంతులు ఇత‌ర ఇన్ ఫెక్ష‌న్ల తో.. బాధ‌పడుతున్న‌ట్లు వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. సమంత ఆరోగ్యంగా ఉన్నారని ఆమె మేనేజర్ చెప్పడంతో సామ్ అభిమానులంతా ఊపిరి పీల్చుకున్నారు.  కాగా సమంత నటించిన పుష్ప ఐటమ్ సాంగ్ పై ఇవాళ కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. పురుషుల మనోభావాలను ఆ సాంగ్ లిరిక్స్ దెబ్బతీశారంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సంస్థ కోర్టును ఆశ్రయించింది.