Surya Grahan 2021:హిందూ సంస్కృతి సంప్రదాయాల్లో గ్రహాణాలకు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది. సూర్య, చంద్ర గ్రహణాలు పడే సమయాన్ని అరిష్టంగా అందరూ భావిస్తారు. ఆ సమయంలో ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటారు. ఆ గ్రహణాన్ని వీక్షిస్తారు. తాజాగా రేపు డిసెంబర్ 4న శనివారం సూర్యగ్రహణం సంభవిస్తోంది. అయితే అది భారతదేశంలో స్వల్పంగానే కనిపిస్తుంది.

తాజాగా శనివారం ఏర్పడే సూర్యగ్రహణం పూర్తిగా దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలోని అన్ని ప్రాంతాల్లో పూర్తి స్తాయిలో కనిపిస్తుంది. భారత కాలమానం ప్రకారం డిసెంబర్ 4న శనివారం ఉదయం రూ.10.59 గంటలకు ప్రారంభమయ్యే సూర్యగ్రహణం మధ్యాహ్నం 3.07 గంటల వరకూ కొనసాగుతుంది. ఇది అతిపెద్ద సూర్యగ్రహణం అని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని గ్రహాలు నమ్మేవారికి పండితులు సూచిస్తున్నారు.
ఈ ఏడాది ఏర్పడే సూర్యగ్రహణం ఇదే చివరిది అని చెబుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం భారత్ లో సరిగ్గా కనపడదని నిపుణులు చెబుతున్నారు.ఈ సూర్యగ్రహణం హిందూ క్యాలెండర్ ప్రకారం కృష్ణపక్షంలోని మార్గశిర అమావాస్య తిథి (అమావాస్య రాత్రి) వస్తుందని చెబుతున్నారు. ఈ గ్రహణాలు అశుభకరమైనదిగా పండితులు సూచిస్తున్నారు.

-సూర్యగ్రహణం సమయానికి ముందు 12 గంటల సమయంలో ప్రజలు ఆహారం తీసుకోవద్దని పండితులు చెబుతున్నారు. పిల్లలు, గర్భిణిలు, రోగులు, వృద్ధులు మాత్రం ఈ నియమానికి దూరం అంటున్నారు. గర్భిణిలు ఈ సమయంలో బయటకు వెళ్లకూడదని సూచిస్తున్నారు. వెళితే శిశువు వికలాంగులు అయ్యే ప్రమాదం ఉందని.. గర్భస్రావం జరగవచ్చని జ్యోతిష్యనిపుణులు చెబుతున్నారు.
గ్రహణం రోజు నీరు తాగడం, మల, మూతవిసర్జన చేయడం.. బ్రష్ చేయడం.. జుట్టు దువ్వడం.. ఆయిల్ మసాజ్, లైంగిక చర్యల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు.
Also Read: ఒక్క ఐడియాతో నెలకు కోటి సంపాదిస్తున్న యువతి..!

గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి గ్రహణానికి ముందు వండి ఆహారాన్ని తినొద్దని.. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రం తినాలని సూచిస్తున్నారు. తినేపదార్థాలను తులసీ ఆకులను జోడించి తినాలని చెబుతున్నారు.
Also Read: శ్రీశైల భ్రమరాంబికకు.. చత్రపతి శివాజీకి మధ్య ఉన్న అనుబంధం గురించి మీకు తెలుసా?