Actress Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పాలి. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోలు అందరి సరసన నటించి సూపర్ హిట్ లు సాధించింది సామ్. అయితే ఆమె ఇటీవల భర్త నాగ చైతన్యతో విడిపోయినట్లు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతూ కెరీర్ పరంగా ఫామ్ లోనే ఉంది సమంత. అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ కి మరోసారి హ్యాండ్ ఇచ్చిందట సమంత.

షారుఖ్ ఖాన్‌తో అట్లీ చేయబోయే చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించాల్సింది. కాగా పలు కారణాల రీత్యా సమంత ఆ పాత్రకు ఒప్పుకోలేదు. దాంతో అట్లీ నయనతారను ఆ పాత్రకు ఎంపిక చేసుకున్నాడు. కరోనా కారణంగా, షారూఖ్ కుమారుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంతో సినిమా ఆలస్యం అయింది. అలానే నయనతార పెళ్ళి కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది.
ఇక అదే టైమ్ లో సమంత నాగచైతన్యతో బాలీవుడ్ ఎంట్రీకి మార్గం సుగమమం అయినట్లు అనుకున్నారు. అయితే ఇప్పుడు అనుకోని రీతిలో అందరికీ షాక్ ఇచ్చింది సామ్. ఈ ప్రాజెక్టు కి సామ్ మళ్ళీ నో చెప్పిందని సినీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అట్లీ మళ్లీ నయనతార వైపు మొగ్గుచూపుతున్నాడని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.