https://oktelugu.com/

Actress Sai Pallavi: “సిరివెన్నెల” చివరి సాంగ్ పై స్పందించిన నటి సాయి పల్లవి…

Actress Sai Pallavi: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దిగ్గజ కవి, గేయ రచయిత అయిన సిరివెన్నెల లేని లోటు తీరనిది. అయితే ఆయ‌న చివ‌రగా పాడిన పాట ప్ర‌స్తుతం ఫుల్ వైర‌ల్ అవుతుంది. నేచుర‌ల్ స్టార్ నాని, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్రలో వ‌స్తున్న శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకు సిరి వెన్నెల సీతా రామశాస్త్రి చివ‌రగా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 8, 2021 / 01:40 PM IST
    Follow us on

    Actress Sai Pallavi: సిరి వెన్నెల సీతారామ శాస్త్రి ఇటీవ‌ల అనారోగ్యంతో మృతి చెందిన విష‌యం తెలిసిందే. సిరివెన్నెల మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. దిగ్గజ కవి, గేయ రచయిత అయిన సిరివెన్నెల లేని లోటు తీరనిది. అయితే ఆయ‌న చివ‌రగా పాడిన పాట ప్ర‌స్తుతం ఫుల్ వైర‌ల్ అవుతుంది. నేచుర‌ల్ స్టార్ నాని, సాయి ప‌ల్ల‌వి ప్ర‌ధాన పాత్రలో వ‌స్తున్న శ్యామ్ సింగరాయ్ అనే సినిమాకు సిరి వెన్నెల సీతా రామశాస్త్రి చివ‌రగా పాట రాశారు. ఈ పాటను ఇటీవ‌ల శ్యామ్ సింగ రాయ్ చిత్ర బృందం విడుద‌ల చేసింది.

    Actress Sai Pallavi

    Also Read: కత్రీనా పెళ్లి అరేంజ్‌మెంట్స్ అదుర్స్.. మెనూలో ఎన్ని వెరైటీలో…

    ఈ పాట పై ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మంది సెల‌బ్రెటీలు స్పందించారు. ఈ పాటతో మ‌ళ్లి సిరివెన్నెల గుర్తుకు వ‌స్తున్నార‌ని సెలబ్రెటీలు కామెంట్ చేశారు. తాజాగా హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి కూడా ఈ పాటపై స్పందించారు. ఈ పాట పై సాయి ప‌ల్ల‌వి స్పంద‌న‌ను ట్విట్ట‌ర్ వేదికగా వ్యక్తపరిచింది. మీరు రాసిన ప్ర‌తి ప‌దం మీ ఆత్మను సూచిస్తుంది సాయి పల్లవి అన్నారు. అలాగే మీరు ఎప్ప‌టికీ మా హృద‌యాల్లో జీవించే ఉంటారు సార్ అని సాయి ప‌ల్ల‌వి కామెంట్ చేసింది. కాగ రాహుల్ సంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు… మిక్కి జే. మేయ‌ర్ సంగీతం అందించారు. ఈ సినిమా ను డిసెంబ‌ర్ 24 తెలుగు తో పాటు త‌మిళ, క‌న్న‌డ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల‌లో పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవితో పాటు కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ పై వెంకట్ బోయనపల్లి ఈ మూవీని నిర్మిస్తున్నారు. నాని కేరీయ‌ర్ లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో తీసిన మూవీ ఇదే కావ‌డం విశేషం.

    Also Read: కమల్ హాసన్ “ఇండియన్ 2 ” సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తమన్నా…