https://oktelugu.com/

Actress Regina: బ్రేకింగ్ న్యూస్ కి రెడీగా ఉండండి అంటున్న … నటి రెజీనా

Actress Regina: 2012 లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్.ఎం.ఎస్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ రెజీనా కసాండ్రా. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామకు అందం, అభినయం, నటన వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదు. దీంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది రెజీనా. కానీ ఈ మధ్య ఈ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 09:34 AM IST
    Follow us on

    Actress Regina: 2012 లో సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ఎస్.ఎం.ఎస్ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన కన్నడ బ్యూటీ రెజీనా కసాండ్రా. ఈమె గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ భామకు అందం, అభినయం, నటన వంటివి మెండుగా ఉన్నప్పటికీ తన ప్రతిభను నిరూపించుకునేందుకు ఇప్పటివరకు సరైన అవకాశం రాలేదు. దీంతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది రెజీనా. కానీ ఈ మధ్య ఈ అమ్మడు తన చిత్ర కథల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తుంది. అలానే పాత్ర ప్రాధాన్యతను బట్టి గ్లామర్ షో చేయడానికి కూడా సిద్ధమే అంటోంది రెజీనా.

    కాగా ఇటీవల రెజీనా ప్రధాన పాత్రలో “బ్రేకింగ్ న్యూస్” అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రానికి సుబ్బు వేదుల దర్శకత్వం వహిస్తుండగా… రా ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, మ్యాంగో మాస్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో రెజీనాతో పాటు హీరో జె.డి. చక్రవర్తి, నటుడు సుబ్బరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌స్తుత సమాజంలో జరుగుతున్న ప‌రిస్థితుల‌పై వాస్త‌విక కోణంలో మూవీ తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. సోమ‌వారం ప్రారంభ‌మైన మూవీ షెడ్యూల్  డిసెంబ‌ర్ మూడో వారం వ‌ర‌కూ కొనసాగుతుందని అంటున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండడం సినిమాకి మరో ప్రత్యేక ఆకర్షణ. అలానే రెజీనా ఈ సినిమాతో పాటు నివేదా థామస్ తో కలిసి సుధీర్ వర్మ డైరెక్సన్ లో ‘శాకిని డాకిని’ అనే మూవీ లో కూడా నటిస్తున్నారు. ఇంకా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రంలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో ఈ ముద్దుగుమ్మ స్టెప్పులేసింది.