Jobs For Freshers: బీటెక్ అర్హతతో ప్రభుత్వ సంస్థల్లో జాబ్స్.. నెలకు 60,000 రూపాయల వేతనంతో?

Jobs For Freshers: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ […]

Written By: Navya, Updated On : November 24, 2021 12:57 pm
Follow us on

Jobs For Freshers: ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఇప్పటికే ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కనీసం 60 శాతం మార్కులతో ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు.

Also Read: అనంతపూర్ డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో జాబ్స్.. ఎలా ఎంపిక చేస్తారంటే?

ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుంటారో వాళ్లకు కనీసం సంవత్సరం పాటు అనుభవం ఉండాలి. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 2021 సంవత్సరం అక్టోబర్ నాటికి 30 సంవత్సరాల కంటే వయస్సు మించకూడదు. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అకడమిక్‌ క్వాలిఫికేషన్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు షార్ట్ లిస్టింగ్ జరుగుతుంది.

వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన తుది ఎంపిక ప్రక్రియ చేస్తారు. ఎవరైతే ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికవుతారో వాళ్లకు నెలకు 23,000 రూపాయలు వేతనంగా లభిస్తుంది. https://www.ecil.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా పూర్తిస్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు.

Also Read: అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. అర్హులెవరంటే?