https://oktelugu.com/

Pushpa: ‘పుష్ప ది రైజ్’​ ట్రైలర్​ రిలీజ్​ఎప్పుడో తెలుసా?

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 24, 2021 / 09:29 AM IST
    Follow us on

    Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్​ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా పుష్ప. ఇందులో రష్మికా హీరోయిన్​గా నటిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్​, సునీల్​ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు అనసూయ కూడా మాస్​ క్యారెక్టర్​లో దర్శనమివ్వనుంది. ఈ ఏడాది డిసెంబరు 17న ఐదు భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది చిత్రబృందం. ఈ సినిమాతోనే బన్నీ బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

    ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్​ పనుల్లో బిజీగా ఉంది చిత్రబృందం. ఈ క్రమంలోనే పుష్ప ట్రైలర్​ కోసం బన్నీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  కాగా, తాజా సమాచారం ప్రకారం డిసెంబరు తొలివారంలో ట్రైలర్​ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్​ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

    కాగా, ఇటీవలే బన్నీ తన డైలాగ్స్ చెప్పేందుకు డబ్బింగ్​ స్టూడియోకి వెళ్తున్న వీడియోను నెట్టింట అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లర్​ పాత్రలో కనిపించున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కాగా, ఇందులో ఐటెం సాంగ్​లో సమంత నటించనుండటం విశేషం. త్వరలోనే ఈ పాట చిత్రీకరణ మొదలుకానుందని తెలుస్తోంది.

    ఇప్పటికే అన్ని భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. ఈ4 ఎంటర్​టైన్మెంట్ సంస్థ మలయాళంలో, తమిళంలో లైకా ప్రొడభన్స్​, కన్నడలో స్వాగత్​ ఎంటర్​ప్రైజెస్​, ఎవర్సీస్​లో హంసినీ ఇంలా అన్ని చోట్ల పుష్పను విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.