Rashi Khanna : అతడితో ఎఫైర్ పెట్టుకున్నాక శరీరంలో మార్పులు వచ్చాయి… రాశి ఖన్నా బోల్డ్ కామెంట్స్!

ర్వాత మరొక వ్యక్తితో రాశి ఖన్నా డేటింగ్ చేసిందట. అప్పుడు బరువు అదుపులోకి వచ్చిందట. మానసిక ప్రశాంత లేనప్పుడు బరువు పెరుగుతాం అట.

Written By: NARESH, Updated On : August 1, 2023 8:32 pm
Follow us on

Rashi Khanna : హీరోయిన్ రాశి ఖన్నా లేటెస్ట్ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది. ఆమె చేసిన కొన్ని కామెంట్స్ షాక్ ఇస్తున్నాయి. డేటింగ్ కారణంగానే బరువు తగ్గానని ఆమె చెప్పడంత చర్చకు దారి తీసింది. రాశి ఖన్నా ఒక దశలో బరువు పెరిగారు. దానికి ఆమె మానసిక ఒత్తిడికి గురి కావడమేనట. ప్రేమించినవాడు దూరం కావడంతో రాశి ఖన్నా డిప్రెషన్ కి గురయ్యారట. ఆ సమయంలో ఆమె విపరీతంగా బరువు పెరిగారట. ఆ ప్రభావం తాను నటించే సినిమాల మీద పడిందట. ఫిట్నెస్ ట్రైనర్ పర్యవేక్షణలో ఎంత వ్యాయామం చేసినా బరువు తగ్గడం లేదట.

అందులోనూ తనకు థైరాయిడ్ సమస్య ఉందట. అసలు ఎందుకు బరువు తగ్గడం లేదని ఫిట్నెస్ ట్రైనర్ కూడా తలపట్టుకునేవాడట. ఫిట్నెస్ ట్రైనర్ ని మార్చినా ఫలితం దక్కలేదట. తర్వాత మరొక వ్యక్తితో రాశి ఖన్నా డేటింగ్ చేసిందట. అప్పుడు బరువు అదుపులోకి వచ్చిందట. మానసిక ప్రశాంత లేనప్పుడు బరువు పెరుగుతాం అట. అలాగే వ్యాయామం చేసినా ఫలితం ఉండదట. ఎప్పుడైతే ఆమెకు తోడు దొరికి ఒత్తిడి తగ్గించుకుందో అప్పుడు బరువు తగ్గిందట.

ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పి రాశి ఖన్నా షాక్ ఇచ్చింది. ఇక రాశి ఖన్నా డేటింగ్ చేస్తున్న ఆ వ్యక్తి ఎవరనే చర్చ మొదలైంది. రాశి ఖన్నా రెలెటిన్షప్ లో ఉన్నారని ఒప్పుకున్నారు కానీ వ్యక్తి పేరు చెప్పలేదు. కాగా రాశీ ఖన్నాకు తెలుగులో వరుస ప్లాప్స్ పడ్డాయి. ప్రతిరోజూ పండగే సూపర్ హిట్ కాగా వెంకీ మామ యావరేజ్ అయ్యింది. అనంతరం చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ నిరాశపరిచింది.

కొంచెం గ్యాప్ ఇచ్చి గత ఏడాది రీ ఎంట్రీ ఇచ్చింది. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన పక్కా కమర్షియల్, థాంక్యూ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో ఆమెకు తెలుగులో ఆఫర్స్ రావడం లేదు. అయితే తమిళంలో చిత్రాలు చేస్తున్నారు. హిందీలో యోధ టైటిల్ తో ఒక మూవీ చేస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరో. దిశా పటాని మరొక హీరోయిన్ గా నటిస్తుంది. రాశి ఖన్నా నటించిన వెబ్ సిరీస్ ఫార్జీ హిట్ టాక్ తెచ్చుకుంది.