Peddireddy Ramachandra Reddy: పెద్దిరెడ్డికి షాక్.. అమిత్ షాకు ఫిర్యాదు

రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షా తో 20 నిమిషాలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రామచంద్ర యాదవ్ వెనుక బిజెపి అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. రామచంద్ర యాదవ్ గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోరాడుతున్నారు .

Written By: Dharma, Updated On : August 1, 2023 8:37 pm

Peddireddy Ramachandra Reddy

Follow us on

Peddireddy Ramachandra Reddy: ఏపీ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఫోకస్ పెట్టారు. ఇటీవలే రాజకీయ పార్టీని ప్రారంభించిన రామచంద్ర యాదవ్ పెద్దిరెడ్డి అవినీతి, అక్రమాలను వెలుగు తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఏకంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకే ఫిర్యాదు చేశారు. పూర్తి ఆధారాలను సమర్పించడం విశేషం. కీలక రాజకీయ పార్టీల నేతలకు.. అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టమైన తరుణంలో.. రామచంద్ర యాదవ్ నేరుగా కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ నాలుగేళ్ల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35 వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని రామచంద్ర యాదవ్ ఆధారాలతో సహా అమిత్ షా కు ఫిర్యాదు చేయడం సంచలనం గా మారింది. పెద్దిరెడ్డికి చెందిన పిఎన్ఆర్ కంపెనీ పై 160 క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 17 మంది డైరెక్టర్ల ద్వారా సూట్ కేస్ కంపెనీలను సృష్టించి అవినీతిని దాచే ప్రయత్నం చేస్తున్న వై నాన్ని రామచంద్ర యాదవ్ అమిత్ షాకు వివరించారు. ఈడి ద్వారా సమగ్ర దర్యాప్తు చేసి పెద్దిరెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా రామచంద్ర యాదవ్ నేరుగా అమిత్ షా తో 20 నిమిషాలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రామచంద్ర యాదవ్ వెనుక బిజెపి అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం జోరందుకుంది. రామచంద్ర యాదవ్ గత కొన్నేళ్లుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోరాడుతున్నారు . ఈ క్రమంలో రామచంద్ర యాదవ్ అనుచరులపై దాడులు కూడా జరిగాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. గత ఎన్నికల్లో పుంగనూరు నుంచి జనసేన అభ్యర్థిగా రామచంద్ర యాదవ్ బరిలో దిగారు. ఇప్పుడు ఆర్భాటంగా సొంత పార్టీని స్థాపించారు. ఈ తరుణంలో కేంద్ర హోం శాఖ మంత్రి అపాయింట్మెంట్ దొరకడం.. 20 నిమిషాల పాటు భేటీ కావడం.. పెద్దిరెడ్డి పై ఆధారాలతో ఫిర్యాదు చేయడం.. ఏపీ పొలిటికల్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది