https://oktelugu.com/

Actress Ramba Daughter: రంభ కూతురిని చూశారా? మైండ్ బ్లాక్ అవుద్ది.. 

ఇటీవల రంభ గురించి సోషల్ మీడియాలో విరీపతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే రంభ తన కూతురుతో కలిసి దిగిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Written By:
  • Srinivas
  • , Updated On : February 16, 2024 / 08:18 AM IST

    Ramba daughter

    Follow us on

    Actress Ramba Daughter:  టాలీవుడ్ ఇండస్ట్రీలో 90వ దశకం స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ సమయంలో ఎన్నో మంచి సినిమాలు వచ్చాయి. దీంతో హీరో, హీరోయిన్లకు డిమాండ్ విపరీతంగా ఉండేది. ఇదే సమయంలో సినీ ఫీల్డులోకి వచ్చిన రంభ ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంది. గ్లామర్ హీరోయిన్ గా అందచందాలను ఆరబోసి కుర్రాళ్ల ఫేవరేట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇటీవల రంభ గురించి సోషల్ మీడియాలో విరీపతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే రంభ తన కూతురుతో కలిసి దిగిన కొన్ని పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీటి వివరాల్లోకి వెళితే..

    ‘ఆ అక్కటి అడక్కు’ అనే సినిమా గురించి ఎవరూ మరిచిపోరు. ఈ మూవీ ఇప్పటికీ వచ్చినా కడుపుబ్బా నవ్వేస్తారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది రంభ. కృష్ణ జిల్లాలో జన్మించిన ఈమె అసలు పేరు విజయలక్ష్మి. కానీ సినిమాలో  రంభ గా మారింది. హీరోయిన్ గా డెబ్యూమూవీలో నటించిన రంభ ఆ తరువాత పలు అవకాశాలు తెచ్చుకుంది. స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, కృష్ణ తదితర హీరోలతో నటించింది. ఒకర దశలో దశాబ్దాలుగా అప్పటికే ఇండస్ట్రీలో ఉన్న హీరోయన్లకు గట్టి పోటీ ఇచ్చింది.

    కొన్నేళ్ల తరువాత రంభ ప్రత్యేక సాంగ్ లో కనిపిస్తూ వచ్చింది. చివరిసారిగా ‘యమదొంగ’ సినిమాలో కనిపించి ఉర్రూతలూగించింది. ఆ తరువాత కెనడాకు చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. కెనడాకు వెళ్లిన రంభ తిరిగి రాలేదు. ఆ తరువాత ఫ్యామిలీ లైఫ్ కే పరిమితం అయింది. రంభ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో ఇద్దరు అమ్మాలు, ఒకరు బాబు ఉన్నారు. సినిమాల్లో నటించకపోయినా రంభ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది.

    తాజాగా రంభ తన పెద్దకూతురుతో కలిసి దిగిన పొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇందులో రంభ లాగే తన కూతురు కూడా ఎంతో అందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ పిక్ కు ‘మై ఎంజిల్’ అని క్యాప్షన్ పెట్టింది. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది. ఇంకేముంది సినీ ఫ్యాన్స్ ఈ ఫొటోలకు తెగ రియాక్టవుతున్నారు. రంభ కంటే అందగా ఉన్నారంటూ క్యాప్షన్ పెడుతున్నారు. అయితే రంభ తన లాగే తన కూతరును సినీ ఇండస్ట్రీలోకి తీసుకొస్తుందా? లేదా? అనే చర్చ ఆసక్తిగా మారింది.