Sarfaraz Khan: సర్ఫరాజ్ గుండెలు పిండేసావు.. నీలాంటోళ్లే ఇండియాకి కావాల్సింది..

ముంబై మహానగరానికి చెందిన సర్ఫరాజ్ అహ్మద్ రెండు సంవత్సరాలుగా భారత్ జట్టుకు ఆడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు గురువారం రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జుట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.

Written By: Velishala Suresh, Updated On : February 16, 2024 8:15 am
Follow us on

Sarfaraz Khan: కొందరికి ఆట అంటే ఇష్టం.. మరికొందరికి ఆట అంటే వ్యాపారం.. కానీ అతడికి మాత్రం ప్రాణం. ఆ ఆట కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపాడు. రెండు సంవత్సరాల పాటు నిరీక్షించాడు. చివరిగా అతని కల నెరవేరింది. భారత జట్టులో ఆడాలి అనే అతనికాంక్ష కార్యరూపం దాల్చింది. రాజ్ కోట్ లో జట్టుతో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టులో అతనికి ఆడే అవకాశం దక్కింది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఆ ఉద్వేగం కొలమానాల్లో కొలువలేనిది. అతడు మైదానంలోకి అడుగుపెట్టేముందు కుటుంబ సభ్యుల నుంచి తీసుకుంటున్న ఆశీస్సులు.. వారు వ్యక్తం చేస్తున్న ఉద్వేగం తాలూకూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ముంబై మహానగరానికి చెందిన సర్ఫరాజ్ అహ్మద్ రెండు సంవత్సరాలుగా భారత్ జట్టుకు ఆడాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎట్టకేలకు గురువారం రాజ్ కోట్ వేదికగా ఇంగ్లాండ్ జుట్టుతో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. వికెట్ కీపర్ ధృవ్ జురెల్ తో పాటు సర్ఫరాజ్ కూడా జాతీయ జట్టులోకి ఆరంగేట్రం చేశాడు. ముంబైలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన సర్ఫ రాజ్ కు శిక్షణ ఇచ్చింది అతడి తండ్రి నౌషద్ ఖాన్. ఆయన తన చిన్న కొడుకు ముషీర్ కు కూడా ఆయనే శిక్షణ ఇచ్చారు. జాతీయ జట్టులో ఆడించేందుకు కృషి చేశారు.

నౌషద్ ఖాన్ గతంలో రంజీలలో ఆడారు. తన ఇద్దరు కొడుకులను క్రికెటర్లను చేసేందుకు చాలా కష్టపడ్డారు. ఆర్థికంగా అది ఆయనకు ఇబ్బంది కలిగించినప్పటికీ వాటన్నింటినీ ఆయన ధైర్యంగా అధిగమించారు. దేశం మొత్తం తన ఇద్దరు కొడుకులను గుర్తించేలా చేశారు. చిన్న కొడుకు ఇటీవల అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు తరఫున ఆడాడు. ఆ ఆనందాన్ని మర్చిపోకముందే పెద్ద కుమారుడు సర్ఫ రాజ్ కు టీమిండియాలో స్థానం దక్కడంతో ఉద్వేగంతో కన్నీటిని కార్చారు. గురువారం రాజ్ కోట్ మైదానం వేదికగా కొడుకును అభినందించారు.. సర్ఫ రాజ్ తన జెర్సీని తండ్రికి చూపించి మురిసిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన చాలామంది.. నీలాంటి వాళ్ళే ఇండియా జట్టుకు కావాలి అంటూ సోషల్ మీడియాలో సర్ఫ రాజ్ ను ఉద్దేశించి కామెంట్లు పెడుతున్నారు.

నౌషద్ ఖాన్ తన ఇద్దరు కొడుకులు సర్పరాజ్, ముషీర్ తమ జెర్సీ నెంబర్ 97 ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం నౌషదే. జాతీయ జట్టుతో పాటు ఐపీఎల్ లో బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడే సమయంలో సర్ఫ రాజ్ జెర్సీ నెంబర్ 97 గానే ఉంది. ఇటీవల దక్షిణాఫ్రికా వేదికగా ముగిసిన ఐసీసీ అండర్ 19 వరల్డ్ కప్ లో సర్ఫరాజ్ తమ్ముడు ముషీర్ ఖాన్ కూడా ఇదే నెంబర్ జెర్సీ వేసుకున్నాడు. హిందీలో నౌ అంటారు. 7 ను సాత్ అంటారు. నౌ సాత్ అనే పదం నౌషద్ కు దగ్గరగా ఉంటుంది. తన తండ్రి తన కోసం పడ్డ కష్టానికి ఇచ్చే గౌరవంగా 97ను తమ జెర్సీ నెంబర్ గా ఎంచుకున్నారు. అది కాకుండా సర్ఫ రాజ్ పుట్టినరోజు సంవత్సరం కూడా 1997 కావడం విశేషం.