https://oktelugu.com/

Star Heroine: ఐఏఎస్ ఆఫీసర్ కావాలని అనుకున్న ఈ చిన్నారి ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ స్టార్ హీరోయిన్… ఎవరో చెప్పగలరా…

Star Heroine: సినిమా నటి నటులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు చాల దగ్గరగా ఉంటున్నారు.వారు ఏం చేసిన కూడా వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.తమకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు

Written By:
  • Srinivas
  • , Updated On : July 12, 2024 / 02:59 PM IST

    Raashi Khanna cute childhood photo goes viral

    Follow us on

    Star Heroine: ఇది వరకటి రోజుల్లో ప్రజలు సినిమా నటి నటుల గురించి ఏదైనా న్యూస్ పేపర్ లో లేదా మ్యాగజిన్ లో చదివి తెలుసుకునే వారు.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సెలెబ్రెటీల నుంచి సినిమా తారల వరకు ఎవరు ఏం చేసిన కూడా అది క్షణాలలో అందరికి తెలిసిపోతుంది.సినిమా నటి నటులు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు చాల దగ్గరగా ఉంటున్నారు.వారు ఏం చేసిన కూడా వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు.తమకు సంబంధించిన సినిమా అప్ డేట్ లను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు సినీ తారలు.దాంతో సినిమా నటి నటులకు,అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది అని చెప్పడం లో సందేహం లేదు.

    ఈ క్రమంలోనే సినిమా నటి నటులు తాము ఇండస్ట్రీ లో అడుగు పెట్టక ముందు ఏం చేసే వారో..ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టారో కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులు తెలుసుకుంటున్నారు.ఇప్పటి వరకు చాలా మంది నటీనటులకు సంబంధించిన రేర్ ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.ప్రస్తుతం నెట్టింట్లో ఒక బూరె బుగ్గల చిన్నారి క్యూట్ ఫోటో ఒకటి అందరిని ఆకట్టుకుంటుంది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ లలో ప్రస్తుతం ఈమె కూడా ఒకరు.ఈమె ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుందట.కానీ ఒక చిన్న వ్యాస్లీన్ యాడ్ లో నటించిన ఈమె సినిమా అవకాశాలు రావడం తో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిన్ననాటి ఫొటోలో క్యూట్ గా బూరె బుగ్గలతో ఉన్న ఈ చిన్నారి మరెవరో కాదు హీరోయిన్ రాశీ ఖన్నా.

    ఈమె ఊహలు గుసగుసలాడే అనే సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది.మొదటి సినిమా తోనే తన అందంతో,నటనతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది.మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న ఈమె వరుస సినిమా అవకాశాలు అందుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపుగా యంగ్ హీరోలు అందరికి జోడిగా నటించింది ఈ బ్యూటీ.అందం,టాలెంట్ ఉన్నప్పటికీ కూడా ఈమెకు మధ్యలో కొంచెం అవకాశాలు తగ్గాయి.కానీ ఆ తర్వాత ఈమె తెలుగు,తమిళ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది అని తెలుస్తుంది.ఇప్పటికి ఈమె స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకోలేకపోతుంది అని తెలుస్తుంది.లేటెస్ట్ గా రాశీ ఖన్నా అరణ్మనై 4 హారర్ సినిమాలో నటించింది.నిజానికి హీరోయిన్ రాశీ ఖన్నా హిందీ సినిమాతో తన కెరీర్ ను స్టార్ట్ చేసింది.ఈమె అబ్రహం నటించిన మద్రాస్ కేఫ్ సినిమాతో నటిగా తన కెరీర్ ను మొదలు పెట్టింది.

    ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా చిన్నది అని చెప్పచ్చు.ప్రస్తుతం ఈమె తమిళ్ లో ది సబర్మతి రిపోర్ట్ సినిమాతో పాటు తలాఖోమే ఏక్ వంటి సినిమాలలో నటిస్తుందని సమాచారం.తెలుగు లో రాశీ ఖన్నా ఊహలు గుసగుసలాడే,జోరు,తొలిప్రేమ,జై లవ కుశ,శివమ్,థాంక్ యు,బెంగాల్ టైగర్,సుప్రీమ్,పక్క కమర్షియల్,వెంకీ మామ వంటి పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.అయితే మొదటి సినిమాలో కొంచెం బొద్దుగా కనిపించిన రాశీ ఖన్నా ఆ తర్వాత ఎవరు ఊహించని విధంగా సన్నగా మారిపోయింది.ప్రస్తుతం రాశీ ఖన్నా చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.అయితే ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కనిపెట్టడం కొంచెం కష్టమే అని చెప్పచ్చు.ఈ ఫొటోలో క్యూట్ గా బొద్దుగా ఉన్నది హీరోయిన్ రాశీ ఖన్నా అని తెలిసి నెటిజన్లు చిన్నప్పుడు రాశీ ఖన్నా చాలా అందంగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.