https://oktelugu.com/

Star Actress: చిరంజీవి తో రోమాన్స్ చెయ్యడం నాకోరిక అంటున్న ప్రముఖ స్టార్ హీరోయిన్

ఆమె మాట్లాడుతూ 'తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నేను ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను.ముఖ్యం గా స్టార్ హీరోలైన బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ తో కలిసి నటించాను.

Written By:
  • Vicky
  • , Updated On : May 12, 2023 / 12:40 PM IST
    Follow us on

    Star Actress: తెలుగు సినిమా ఇండస్ట్రీ యాక్టింగ్ చేసే హీరోయిన్లు దొరకడం చాలా కష్టం,కేవలం అందాల ఆరబోతతోనే నెట్టుకొని వచ్చే హీరోయిన్లు ఎంతో మంది ఉన్నారు, వయస్సు పెరిగి అందం తరిగిపోయిన తర్వాత సినిమాల్లో కనిపించకుండా మాయం అయ్యిపోతున్నారు.అందంగా ఉండడం అవసరమే, కానీ నటన అంతకంటే ఎక్కువ అవసరం.

    అలా అందం , డ్యాన్స్ మరియు నటన ఇలా అన్నిట్లో శబాష్ అనిపించుకున్న అతి తక్కువమంది హీరోయిన్స్ లో ఒకరు ప్రియమణి. హీరోయిన్ ఒకప్పుడు ఈమె పెద్ద స్టార్ గా చాలా సంవత్సరాలు కొనసాగింది, ఆ తర్వాత పెళ్లి అయ్యాక కూడా సినిమాలు కొనసాగిస్తూ కేవలం నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే పోషిస్తూ ముందుకి వెళ్తుంది.లేటెస్ట్ గా ఆమె నాగ చైతన్య హీరో గా నటించిన ‘కస్టడీ’ చిత్రం లో ఒక ముఖ్య పాత్ర పోషించింది. ఈరోజు ఈ చిత్రం గ్రాండ్ గా తెలుగు మరియు తమిళం బాషలలో విడుదలైంది.

    ఈ సినిమా విడుదల సందర్భంగా ప్రొమోషన్స్ లో కూడా చురుగ్గా పాల్గొన్నది,అయితే రీసెంట్ గా ఆమె టాలీవుడ్ హీరోల గురించి చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నేను ఎంతోమంది హీరోలతో కలిసి పని చేశాను.ముఖ్యం గా స్టార్ హీరోలైన బాలకృష్ణ , నాగార్జున మరియు వెంకటేష్ తో కలిసి నటించాను.

    కానీ నాకు చిరంజీవి తో కలిసి రొమాన్స్ చెయ్యాలని ఉంది, ఆయనతో ఒక్క సినిమా నటించాలని ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.అలాగే యాంకర్ మీకు ఇష్టమైన హీరో ఎవరు అని అడిగిన ప్రశ్న కి ఆమె సమాధానం చెప్తూ ‘నాకు చిన్నప్పటి నుండి షారుఖ్ ఖాన్ అంటే పిచ్చి’ అనే చెప్పుకొచ్చింది ప్రియమణి.