Actress Pragathi: ఓ సినిమాలో సీనియర్ నటి రమాప్రభ చెప్పినట్లు ఏ ఏజ్ కు ఆ ఏజే ఫ్రెష్. ఫొటోలు, వీడియోలు షేర్ చేయాలంటే యూత్ వాళ్లే చేయాలా? ఇంకెవరు చేయకూడదా? వయసు శరీరానికి కానీ మనసుకు కాదు. మనసు ఎంతో ఉత్తేజంగా ఉంటే అంతలా దూసుకుపోవడం చూస్తూనే ఉన్నాం. తొంభై ఏళ్ల వయసులో ఓ బామ్మ తల్లవడం తెలిసిందే. డెబ్బయ్యేళ్ల వయసులో కూడా జిమ్ కు వెళ్లి కుస్తీ పోటీల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. అదంతా వారి ఇష్టం. ప్రజాస్వామ్య దేశంలో ఎవరికి ఇష్టం వచ్చింది వారు చేసుకోవచ్చు. ఇందులో ఎవరి అభ్యంతరాలు అవసరం లేదు. అలా కొందరు సిగ్గు పడుతుంటే కొందరు మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్లుగా తాము అనుకున్నది చేయడమే అలవాటుగా మార్చుకుంటారు.
తెలుగు సినిమాల్లో సీనియర్ నటి ప్రగతి. అమ్మ, అత్త, వదిన, ఇతర పాత్రల్లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్న నటి. లాక్ డౌన్ సమయంలో ఆమె జిమ్ కు వెళ్లి అక్కడ పలు విన్యాసాలు చేసింది. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో నెటిజన్లు ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఈ వయసులో ఏంటి ఆంటీ అని క్వశ్చన్ చేయడంతో ఏజ్ తో సంబంధం ఏమిటి? నాకు ఉత్సాహం ఉంది చేస్తున్నాను అంటూ వారికి సమాధానం చెప్పింది. దీంతో వారి నోళ్లకు తాళం వేసినట్లు అయింది.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్రలో ఆమె ఉండాల్సిందే. ఆమె లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. అంతలా తెలుగు సినిమాల్లో తన ప్రభావం చూపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ సందడి చేస్తోంది. అందుకే నెటిజన్లు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వారికి తనదైన శైలిలో జవాబులు ఇస్తోంది. ఆమె వయసు నాలుగు పదులు దాటినా ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు. బనియన్ మీద ప్రగతి పెట్టిన పోజులకు ప్రేక్షకులు పరేషాన్ అవుతున్నారు.
ఇంత లేటు వయసులో అంత ఘాటు ఫొటోలతో అదరగొడుతోంది. జిమ్ ఫొటోలు షేర్ చేస్తూ తానో బాడీ బిల్డర్ గా చూపిస్తోంది. దీంతో ప్రగతి కండలు చూసి అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి లో మరో యాంగిల్ ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. అయినా ఆమె మాత్రం వెరవడం లేదు. వారి ప్రశ్నలకు కూల్ గా సమాధానాలు చెబుతుంది. కరోనా సమయం నుంచి జిమ్ అలవాటు అయిందని అందులో భాగంగానే ఖాళీ సమయాల్లో జిమ్ కు వెళ్లడం అలవాటుగా మారిందని చెబుతోంది.