Dance Video: సినిమా పాటలు కమర్షియల్ కోణంలో ఉంటాయి. కానీ పల్లె పాటలు అలా కాదు. సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. యాసను ప్రపంచానికి సరికొత్తగా తెలియజేస్తాయి. అందువల్లే పల్లె పాటలు నేటి కాలంలో విపరీతమైన ప్రాచుర్యం పొందుతున్నాయి. అలాంటి వాటిల్లో “బొంబాయి రాను” అనే పాట విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. తెలంగాణ మాండలికంతో సాగే ఈ పాట ప్రాంతాలతో సంబంధం లేకుండా దుమ్ము రేపి వదిలిపెడుతోంది. యూట్యూబ్లో అయితే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. పీఆర్వో వ్యవస్థ లేకుండా.. పెయిడ్ వ్యవస్థ లేకుండా ఈ స్థాయిలో రికార్డులు కొలగొట్టిందంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ఈ పాట రూపొందించిన వారు సెలబ్రిటీలు అయిపోయారు. ఇదే స్థాయిలో మరో కొత్త పాటలను రూపొందించడానికి కష్టపడుతున్నారు..
Also Read: ప్రముఖ బాలీవుడ్ నటి మృతి..కన్నీటి పర్యంతమైన భర్త..హృదయాలను పిండేస్తున్న వీడియో!
ఈ పాట తెలంగాణ జనానికి విపరీతంగా ఎక్కేసింది. పెళ్లిళ్లు ఇతర వేడుకలు ఎక్కడ చూసినా సరే ఈపాటే వినిపిస్తోంది. ఈ పాటకు డ్యాన్సులు వేస్తూ యువత రెచ్చిపోతుంది. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. చూడబోతే అదొక కాలేజీ ఫంక్షన్ లాగా ఉంది. యువతీ యువకులు ట్రెడిషనల్ డ్రెస్ లలో కనిపించారు. వేదిక మీద ఉన్న అమ్మాయిలు లంగా వోణిలు ధరించి డ్యాన్సులు వేయగా.. వేదిక కింద ఉన్న అబ్బాయిలు పంచే చొక్కాలు ధరించి పాటకు లయబద్ధంగా స్టెప్పులు వేశారు.. అచ్చం ఆ పాటలో వేసినట్టుగానే డ్యాన్సులు వేశారు. ఇక ఈ దృశ్యాలను కొంతమంది ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సామాజిక మాధ్యమాలలో సంచలనం సృష్టిస్తోంది. “సినిమా పాటలకు మించిన కిక్కు ఈ పాటలో వస్తోంది. ఇందులో ఏ మ్యాజిక్ ఉందో తెలియడం లేదు గాని.. ఆ పిల్లల డ్యాన్సులు చూస్తే సంతోషం కలుగుతోంది. ఇటీవల కాలంలో ఏ పాట కూడా ఈ స్థాయిలో ఆదరణ సొంతం చేసుకోలేదు. తెలంగాణ మాండలికంలో.. రూపొందించిన ఈ పాట విపరీతమైన ఆదరణ సొంతం చేసుకున్నది. ఇది పల్లె ప్రజల పాట. ఈ స్థాయిలో హిట్ అయిందని” నెటిజన్లు అంటున్నారు. యువతీ యువకులు డాన్స్ చేసిన ఈ పాట కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ పాట వేలాది వీక్షణలను సొంతం చేసుకుంది. యువతీ యువకుల డ్యాన్స్ చూసిన ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు. పోటాపోటీగా స్టెప్పులు వేశారని.. ఈ పాటను మరొక స్థాయికి తీసుకెళ్లారని అంటున్నారు.. యువతీ యువకులు డాన్సులు వేస్తుంటే ప్రకృతిని చూసి పరవశించిపోయిన నెమళ్లు సయ్యాటలాడినట్టు ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
Enthaina folk songs lo unde feel eh veerabbaa!!
Kinda boys entry aithe pic.twitter.com/jEmNtqw6jb
— Pallavi Muralikrishna (@Pallavi_M_K) June 27, 2025