Pooja Hegde Wedding: హీరోయిన్ ప్రియమణిపై క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. మరి అదే నిజమైతే ఫ్యాన్స్ కి బిగ్ షాక్ అని చెప్పొచ్చు. పూజా హెగ్డే టైం బాగోలేదు. 2022 తర్వాత ఆమెకు హిట్ లేదు. రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతోంది. పూజా హెగ్డే నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరుసగా ఫెయిల్ అయ్యాయి. అది చాలదన్నట్లు చేతులో ఉన్న చిత్రాలు కూడా చేజారాయి.
పూజా హెగ్డే సైన్ చేసిన జనగణమన మధ్యలో ఆగిపోయింది. విజయ్ దేవరకొండకు జంటగా దర్శకుడు పూరి జగన్నాధ్ స్టార్ట్ చేసిన జనగణమన నుండి నిర్మాతలు తప్పుకున్నారు. జనగణమన ఆగిపోవడంతో దాదాపు రూ. 5 కోట్లు పూజా నష్టపోయింది. పూజా కోల్పోయిన మరో క్రేజీ ప్రాజెక్ట్ గుంటూరు కారం. శ్రీలీలను మెయిన్ హీరోయిన్ చేసి ఆమె పాత్ర ప్రాధాన్యత తగ్గించిన నేపథ్యంలో పూజా మధ్యలో వెళ్ళిపోయారనే వాదన వినిపించింది.
మహేష్ బాబు మూవీలో ఆఫర్ కోల్పోవడం చిన్న విషయం కాదు కదా. అలాగే పూజా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారట. ఆమె కాలికి సర్జరీ జరిగిందంటూ కథనాలు వెలువడ్డాయి. తెలుగులో పూజా హెగ్డే అధికారిక ప్రకటించిన చిత్రం ఒక్కటి లేదు. శ్రీలీల, రష్మిక, సమంత వెంటబడుతున్న స్టార్స్ పూజాను పక్కన పెట్టేసిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పూజా హెగ్డే ఓ స్టార్ క్రికెటర్ తో పెళ్ళికి సిద్ధం అవుతున్నారట. ఈ మేరకు ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
కొన్నాళ్లుగా సదరు ముంబై క్రికెటర్ కి సన్నిహితంగా ఉంటున్న పూజా హెగ్డే మూడుముళ్ల బంధంలో అడుగుపెట్టనుంది వార్తలు వస్తున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఎవరనేది సస్పెన్సు. అదే సమయంలో ఇవి ఊహాగానాలు మాత్రమే కావచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ఎఫైర్ అంటూ కథనాలు వెలువడ్డాయి. అందుకే సల్మాన్ ఆమెకు తన బ్యానర్లో ఆఫర్స్ ఇచ్చాడంటూ రాసుకొచ్చారు. సల్మాన్ టీమ్ స్వయంగా ఈ వార్తలను ఖండించారు.