Tollywood: ఆన్ స్క్రీన్ పైన ఈ జంటలు అంటే నెటిజన్లకు అసలు నచ్చదు.. చీదరించుకుంటారట.

మోస్ట్ ఎలిజబుల్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటించింది. అసలు ఒక్కరు అయినా ఈ జోడీ సూపర్, బాగుంది అనే మాట మాట్లాడలేదు. అఖిల్ కి పెయిర్ గా పూజా అస్సలు నప్పలేదు.

Written By: Suresh, Updated On : September 27, 2023 2:05 pm

Tollywood

Follow us on

Tollywood: స్క్రీన్ పై కొన్ని జంటలను చూస్తే ఎంతో బాగున్నారు అనిపిస్తుంది. వీళ్లు నిజంగానే భార్యభర్తలా? లవ్ లో ఉన్నారా? ఉంటే బాగుండు. పెళ్లి చేసుకుంటే బాగుండు అని అభిమానులు కోరుకుంటారు. అలాంటి వారిలో ప్రభాస్-అనుష్క, చైతూ-సమంత, రానా-కాజల్, విజయ్ దేవరకొండ-రష్మిక..ఇలా కొన్ని జోడీలు మైమరిపించారు. కానీ కొందరిని చూస్తే స్టోరీ బాగున్నా కూడా ఏంట్రా బాబు వీరికి ఇంకా వేరే వాళ్లు దొరకలేదా? ఈ జోడిని ఎలా సెట్ చేశారు అని మొహం చాటేస్తారు కొందరు అభిమానులు. నచ్చిన జోడీలు ఉంటే ఇలా నచ్చని జోడీలు కూడా ఉంటారండోయ్.. మరి వారెవరు అనుకుంటున్నారా?

మహేష్ బాబు -రష్మిక
సినిమాల్లో అసలు సెట్ అవని జోడీ అంటే ముందుగా మహేష్ బాబు, రష్మిక మందన గుర్తు వస్తారు. వీళ్లిద్దరూ కలసి అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ ను సంపాదించింది. కానీ జోడీ మాత్రం బోల్తా పడింది. అసలు ఈ జోడీతో ఎందుకు సినిమా తీశారు అనే రేంజ్ లో నెగటివ్ టాక్ వచ్చింది.

వెంకటేష్ -పాయల్
వెంకీ మామ సినిమా గుర్తుందా? నాగచైతన్య, వెంకటేష్ లు ఇద్దరు హీరోలుగా కలిసి నటించిన సినిమానే వెంకీ మామ. అప్పటికే RX100 సినిమాతో బోల్డ్ బ్యూటీ అనిపించుకున్న పాయల్..వెనువెంటనే సీనియర్ హీరోతో అనేసరికి ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేకపోయారు. అంతే విధంగా జోడీకూడా ఎవరికి నచ్చలేదు. తిట్టిపోశారు అనుకోండి జోడీని.. మరి వెంకీతో పాయలా? అది కూడా ప్యామిలీ మ్యాన్ బోల్డ్ బ్యూటీతో అంటూ ట్రోలింగ్ చేశారు.

విక్రమ్ -కీర్తి సురేష్
స్వామి 2లో విక్రమ్ తో జతకట్టింది కీర్తి సురేష్. ఈ జోడీ వల్లనే కొందరు సినిమా కూడా చూడలేదట. ముందుగా కాంబినేషనే నచ్చలేదు ఇంక సినిమా ఎలా చూసేది అంటూ కామెంట్స్ కూడా చేశారు.

చిరంజీవి-త్రిష
స్టాలిన్ మూవీలో చిరంజీవి త్రిష కలసి నటించారు. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథ పరంగా బావున్నప్పటికీ ఈ జోడీ మధ్య కెమిస్ట్రీ అంతగా సెట్టవలేదనే కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సినిమా కూడా రాబోతుంది అనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదే గనుక నిజం అయితే ఈ జంటను ఇప్పుడు ఎలా ఆదరిస్తారో చూడాలి.

అఖిల్ – నిధి అగర్వాల్
మిస్టర్ మజ్ను సినిమాలో అఖిల్ కి హీరోయిన్ గా నటించింది నిధి అగర్వాల్. ఈ స్టోరీ ఎలా ఉంది, సినిమా హిట్టా ఫట్టా పక్కనపెడితే వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ అస్సలు వర్కౌట్ అవలేదు

అఖిల్-పూజా హెగ్డే
మోస్ట్ ఎలిజబుల్ సినిమాలో అఖిల్ సరసన పూజా హెగ్డే నటించింది. అసలు ఒక్కరు అయినా ఈ జోడీ సూపర్, బాగుంది అనే మాట మాట్లాడలేదు. అఖిల్ కి పెయిర్ గా పూజా అస్సలు నప్పలేదు.. వీళ్లిద్దరి మధ్యా కెమిస్ట్రీ చూడలేకపోయాం అనే కామెంట్స్ వచ్చాయి కానీ బాగున్నారు అనే టాక్ వినిపించలేదు. సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చినా జోడీ ఫెయిల్ అనే చెప్పాలి

నాగ చైతన్య- కాజల్
అప్పట్లో దడ అనే ఓ సినిమా వచ్చింది…అందులో నాగచైతన్యతో కలసి నటించింది కాజల్ అగర్వాల్. అప్పట్లో ఈ పెయిర్ పైనా కామెంట్స్ వచ్చాయి. అంతే కాదు చైతుకు పెయిర్ గానా? అక్కగానా? దేనికోసం ఈ సినిమాలో చైతూ, కాజల్ ను కలిశారు అంటూ దారుణమైన ట్రోల్స్ చేశారు.

అల్లు అర్జున్-భానుశ్రీ
గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన చిత్రం వరుడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోర్లా పడింది. ఇందులో కథ, కథనం మాట పక్కనపెడితే హీరోయిన్ కూడా మైనస్సే. బన్నీ-భానుశ్రీ మధ్య లవ్ ట్రాక్ ప్రేక్షకులకు అస్సలు కనెక్ట్ అవలేదు.