https://oktelugu.com/

Nivetha pethuraj: ఛాన్స్ లు రాకపోతే ఆ పనే చేస్తా.. హీరోయిన్ కన్నీళ్లు

Nivetha pethuraj: హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, ఆమెలో మ్యాటర్ ఉంది. ఆమె టాలెంటెడ్ అని ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో రుజువు అయ్యింది. అందంలోనే కాదు, అభినయంలోనూ నివేదా పేతురాజ్ లో ఎటువంటి వంక పెట్టలేం. పైగా డస్కీ బ్యూటీ అంటూ ఆమెకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దానికి తోడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలందరికి ఆమె కరెక్ట్ జోడీ. అన్నిటికీ మించి నిర్మాతల హీరోయిన్. ఎక్కువ […]

Written By:
  • Shiva
  • , Updated On : May 19, 2022 / 01:49 PM IST
    Follow us on

    Nivetha pethuraj: హీరోయిన్ గా నివేదా పేతురాజ్ కి పెద్దగా గుర్తింపు రాలేదు కానీ, ఆమెలో మ్యాటర్ ఉంది. ఆమె టాలెంటెడ్ అని ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో రుజువు అయ్యింది. అందంలోనే కాదు, అభినయంలోనూ నివేదా పేతురాజ్ లో ఎటువంటి వంక పెట్టలేం. పైగా డస్కీ బ్యూటీ అంటూ ఆమెకు యూత్ లో ఫుల్ క్రేజ్ ఉంది. దానికి తోడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరోలందరికి ఆమె కరెక్ట్ జోడీ. అన్నిటికీ మించి నిర్మాతల హీరోయిన్. ఎక్కువ రెమ్యునరేషన్ అడగదు. ఎక్కువ డిమాండ్స్ చేయదు. ఇన్నీ మంచి లక్షణాలు ఉన్నప్పటికీ నివేదా పేతురాజ్ కి మాత్రం, సాలీడ్ అవకాశాలు మాత్రం రావడం లేదు.

    Nivetha pethuraj

    తేడా ఎక్కడ జరుగుతుందో ? తనకు అర్థం కావడం లేదని, ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతూ నివేదా చాలా బాధ పడింది. తనను ఒకపక్క టాలెంటెడ్ హీరోయిన్ అంటూనే, మరోపక్క కేవలం సెకండ్ హీరోయున్ గానే చూస్తున్నారు అంటూ విమర్శలు కూడా చేసింది. స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు తనకు ఎందుకు ఇవ్వరు అంటూ కుమిలిపోయింది.

    Also Read: Mahesh Babu Beauty Secret: మహేష్ బాబు అందం రహస్యం లీక్ అయ్యింది!

    అప్పుడు, ఆమె చేసిన కామెంట్స్ కారణంగా.. ఈ మధ్య నివేదా పేతురాజ్ పరిస్థితి ఇంకా దారుణంగా మారింది. పూర్తిగా సైడ్ పాత్రల కోసమే ఆమెను అడుగుతున్నారట. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ పాత్రలు వచ్చేవి. ఇప్పుడు చిన్న హీరోల సినిమాల్లో కూడా నివేదా పేతురాజ్ కు సైడ్ పాత్రలే వస్తున్నాయి. ఈ లెక్కన ఇక తాను సోలో హీరోయిన్ గా ఎప్పుడు సక్సెస్ లు అందుకోవాలి, అదే నివేదా పేతురాజ్ ఆవేదన.

    Nivetha pethuraj

    ఎప్పటి నుంచో సోలో హీరోయిన్ గా నటించి ఫేమ్ తెచ్చుకోవాలని కలలు కంటూ ఉంది. కానీ, ప్రస్తుతం ఆ వచ్చే అరకొర ఛాన్స్ లు కూడా రావడం లేదు. అందుకే, తన అవకాశాల పై నివేదా తాజాగా ఎమోషనల్ అయ్యింది. ఆ ఎమోషనల్ లో తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ, నివేదా ఏమి మాట్లాడిందో ఆమె మాటల్లోనే విందాం. ‘సినిమాల్లోకి నేను ప్లాన్ చేసుకుని రాలేదు. అనుకోకుండానే వచ్చాను. అందుకే, హీరోయిన్‌ గా కంటే.. నన్ను నేను నటిగానే నేను ఎక్కువ ఇష్టపడతాను.

    చాలా మంది హీరోయిన్స్ .. చాలా విషయాల్లో భయపడతారు, సర్దుకుపోతారు. కానీ, నేను అలా చేయలేను. నటనకు ప్రాధాన్యత ఉంటేనే ఆ సినిమాలో నటిస్తాను. ఒకవేళ నాకు అవకాశాలు రాకపోతే, జాబ్ చేసుకుంటాను. చాలామందికి తెలియదు, సినిమాల్లోకి రాకముందు నేను బొటిక్‌ నిర్వహించేదాన్ని. పలు ఈవెంట్లు, కార్ల కంపెనీల్లో కూడా పని చేశాను. ఇప్పుడు కూడా పని చేయగలను’ అంటూ నివేదా ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. మరి మళ్లీ కార్ల కంపెనీల్లో పని చేసే పరిస్థితి నివేదాకి రాకూడదు అని కోరుకుందాం.

    Also Read:Cannes 2022: ‘కాన్స్’ లోనూ నార్త్ భామలతో పోటీ పడుతున్న సౌత్ భామలు
    Recommended Videos


    Tags