https://oktelugu.com/

Nivetha Pethuraj: నివేదా పెతురాజ్ కి ఆ స్టార్ హీరో లగ్జరీ హౌస్ ఇచ్చాడా… ఓపెన్ అయిన అల్లు అర్జున్ హీరోయిన్

నివేదా పెతురాజ్ కి ఒక హీరో లగ్జరీ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చాడట. అది కూడా విదేశంలో. ఈ మేరకు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై నివేదా పెతురాజ్ స్పందించారు.

Written By: , Updated On : March 6, 2024 / 10:55 AM IST
Actress Nivetha Pethuraj clarifies rumours spread against her

Actress Nivetha Pethuraj clarifies rumours spread against her

Follow us on

Nivetha Pethuraj: మెంటల్ మదిలో మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది నివేదా పెతురాజ్. ఆ మూవీ జనాల్లోకి వెళ్ళలేదు. అయితే మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. అనంతరం తెలుగులో చిత్రలహరి, బ్రోచేవారేవారురా వంటి హిట్ చిత్రాల్లో ఆమె నటించారు. అల్లు అర్జున్(Allu Arjun) బ్లాక్ బస్టర్ మూవీ అల వైకుంఠపురంలో చిత్రంలో నివేదా పెతురాజ్ సెకండ్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. కాగా నివేదా పెతురాజ్ పై ఒక రూమర్ సర్కులేట్ అవుతుండగా ఆమె స్పందించారు.

నివేదా పెతురాజ్ కి ఒక హీరో లగ్జరీ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చాడట. అది కూడా విదేశంలో. ఈ మేరకు ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై నివేదా పెతురాజ్ స్పందించారు. ఆమె వివరణ ఇచ్చారు. తనపై జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదని ఆమె వెల్లడించారు. ఆమె సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు. నేను ఒక గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టాను. అలానే జీవించారు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కూడా నాకు అవకాశాలు ఇవ్వమని ఈ దర్శకుడిని, నిర్మాతను అడిగింది లేదు.

మా కుటుంబం ఎప్పటి నుండో దుబాయిలో ఉంటుంది. దుబాయ్ లో నాకు ఓ హీరో లగ్జరీ హౌస్ ఇచ్చాడు అనడంలో నిజం లేదు.. అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఆమెకు లగ్జరీ హౌస్ గిఫ్ట్ గా ఇచ్చాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఇలా స్పందించారు. నివేదా పెతురాజ్ వివరణ ఇచ్చారు. ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం నివేదా పెతురాజ్ ఏ ఎల్ విజయ్ తెరకెక్కిస్తున్న బో మూవీ లో నటిస్తుంది. ఇది హారర్ థ్రిల్లర్. అలాగే పార్టీ టైటిల్ తో ఒక తమిళ్ మూవీ చేస్తుంది. నివేదా పెతురాజ్ కెరీర్ ఒడిదుడుకుల మధ్య సాగుతుంది. ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు.