Janhvi Kapoor: జాన్వీ కపూర్ డబ్బు కోసం ఏమైనా చేస్తుందా?

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భారీగా సందడి చేస్తున్న జాన్వీ కపూర్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది.

Written By: Swathi, Updated On : March 6, 2024 10:45 am

Janhvi Kapoor

Follow us on

Janhvi Kapoor: అపర కుబేరుడు ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కు బాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఇక ఈ వేడుకలు జామ్ నగర్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఫ్రీ వెడ్డింగ్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ వేడుకలో జాన్వీ కపూర్ హైలెట్ అయ్యారు. మొత్తం ఈమదే అన్నట్టు మెరిసింది.

అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో భారీగా సందడి చేస్తున్న జాన్వీ కపూర్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలకు సంబంధించిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఇందులో రాధిక మర్చంట్ పెళ్లి కూతురుగా ముస్తాబై నడుస్తూ వస్తుంటే పక్కనే కొందరు ఆమెపై పూలు చల్లుతూ ఉంటే మరికొందరు హారతులు పడుతూ నిల్చున్నారు. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ ఏకంగా హారతి పళ్లెం పట్టుకొని హారతి ఇచ్చింది. అయితే ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ గా మారింది.

ఈ వీడియో మీద నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ట్రోల్ కూడా చేస్తున్నారు. డబ్బు ఎంతటి పనిని అయినా చేయిస్తుందని.. జాన్వీ కూడా ఎలాంటి పనులు అయినా చేయడానికి సిద్దమైంది అంటూ జాన్వీ వ్యవహార శైలిని తప్పు పడుతున్నారు. కానీ కొందరు మాత్రం హారతి పట్టడంలో తప్పు ఏముంది? ఇందులో కూడా ఎందుకు తప్పు ఎంచుతున్నారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జాన్వీ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయింది.

ముఖ్యంగా తెలుగులో ఈమె స్టార్ హీరోలందరితో కలిసి సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయింది జాన్వీ. ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఎన్టీఆర్ తో మాత్రమే కాదు బుచ్చిబాబు రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా జాన్వీ ఛాన్స్ కొట్టేసింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జాన్వీ అంబానీ పెళ్లి వేడుకల్లో వైరల్ గా మారింది.