https://oktelugu.com/

Shriya Saran: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?

Shriya Saran: హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల శ్రియ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సహజంగా తల్లి అయ్యాక, ఇక ఏ హీరోయిన్ అయినా గ్లామర్ ప్రపంచానికి కనీసం ఓ ఐదారేళ్లు గ్యాప్ ఇస్తోంది. కానీ శ్రియ మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తన రూటే సెపరేట్ అంటూ తెగ ముచ్చట పడేది. పైగా తన ప్రెగ్నన్సీ విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచింది. నిజానికి తన కూతురుకు 9 […]

Written By:
  • Shiva
  • , Updated On : December 7, 2021 / 06:30 PM IST
    Follow us on

    Shriya Saran: హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇటీవల శ్రియ ఓ బిడ్డకు జన్మనిచ్చింది. సహజంగా తల్లి అయ్యాక, ఇక ఏ హీరోయిన్ అయినా గ్లామర్ ప్రపంచానికి కనీసం ఓ ఐదారేళ్లు గ్యాప్ ఇస్తోంది. కానీ శ్రియ మాత్రం గర్భవతిగా ఉన్నప్పుడు కూడా గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. తన రూటే సెపరేట్ అంటూ తెగ ముచ్చట పడేది. పైగా తన ప్రెగ్నన్సీ విషయాన్ని చివరి వరకు రహస్యంగా ఉంచింది.

    Shriya Saran

    నిజానికి తన కూతురుకు 9 నెలలు వచ్చిన తర్వాతే.. తాను తల్లిని అయ్యాను, ఈ పాప నాకు పుట్టిందే అంటూ తనలోని తల్లితనాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. పైగా తన కూతురు మొదటి బర్త్ డే రాకముందే.. మళ్ళీ సినిమాల్లో నటించడానికి రెడీ అయిపోయింది. ఎలాగూ ఎప్పుడో రెండేళ్ల క్రితం ‘గమనం’ అనే సినిమాలో నటించింది ఈ ముదురు భామ.

    అయితే, ఎన్నో అడ్డంకులను, అవరోధాలను దాటుకుని మొత్తానికి ఆ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కి సిద్ధం అయింది. ఈ వారం గమనం సినిమా విడుదల కాబోతుంది. మరి తన సినిమా రిలీజ్ కాబోతుంటే.. శ్రియ సైలెంట్ గా ఎందుకు ఉంటుంది. అసలుకే ఎప్పుడు తనకు ఛాన్స్ దొరుకుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న ప్రాణం అయ్యే.

    Also Read: ఫుల్ స్పీడ్ లో విక్రమ్ – వేద హిందీ రీమేక్ షూటింగ్…
    కాబట్టి.. ప్రమోషన్స్ లో రెచ్చిపోతూ మొత్తానికి లైమ్ లైట్ లోకి రావడానికి అందాల ఆరబోతకు మళ్ళీ సిద్ధం అని డైరెక్ట్ గానే స్టేట్మెంట్స్ పాస్ చేస్తోంది. పైగా చాలా ఫిట్ గా తయారైంది. ఇదే విషయాన్ని మీడియా ఆమె ముందు ఉంచింది. ఇక అంతే.. నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చాను అంటే.. అంటూ అర్ధగంట సేపూ తనలోని ఇంకా మిగిలి ఉన్న అందాల పరిధి గురించి వివరణ ఇచ్చింది.

    మరి శ్రియ చెప్పిన ముచ్చట్లో ముఖ్యమైనవి ఆమె మాటల్లోనే.. “నేను తల్లి అయ్యాక , నా బాడీలో చాలా మార్పులు వచ్చాయి. ఆ సమయంలో బాగా లావు అయిపోయాను. కానీ, ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కావాలని.. ఎంతో కష్టపడి వర్కవుట్లు చేసి, కథక్ డ్యాన్స్ చేస్తూ.. మొత్తమ్మీద మళ్లీ ఫిట్ నెస్ సాధించాను’ అంటూ అసలు ముచ్చట చెప్పుకొచ్చింది శ్రియ.

    Also Read: ఛత్రపతి రీమేక్ కి టైటిల్ కష్టాలు… అయోమయంలో బెల్లంకొండ

    Tags