https://oktelugu.com/

Actress Nayanatara: ఆ హీరోతో నటించడానికి అసంతృప్తి వ్యక్తం చేసిన లేడీ సూపర్‌ స్టార్‌… నయనతార

Actress Nayanatara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ​ బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “గాడ్​ ఫాదర్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన చెల్లి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న విషయాన్ని యూనిట్ బృందం అధికారికంగా వెల్లడించారు. చెల్లి పాత్రకి భర్తగా హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ప్రస్తుతం […]

Written By: , Updated On : December 4, 2021 / 08:25 PM IST
Follow us on

Actress Nayanatara: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ​ బిజీగా ఉన్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “గాడ్​ ఫాదర్” సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘లూసిఫర్‌’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో కీలకమైన చెల్లి పాత్రలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న విషయాన్ని యూనిట్ బృందం అధికారికంగా వెల్లడించారు. చెల్లి పాత్రకి భర్తగా హీరో సత్యదేవ్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఇదే అంశం చర్చకు దారి తీసింది.

actress nayanatara shocking commnets about her role in god father movie

Nayanatara

అసలు విషయమేంటే తనకు జోడిగా సత్యదేవ్‌ నటించడంపై నయనతార అసంతృప్తి వ్యక్తం చేశారని కథనాలు వస్తున్నాయి. తనకు జోడీగా పాపులారిటీ ఉన్న హీరోను కాకుండా యువ హీరో ని తీసుకోవడంపై నయనతార స్పందిస్తూ… తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా అని నయనతార స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ అంశంలో  సత్యదేవ్‌ను మార్చడం కుదరదని, మెగాస్టార్ తర్వాత అనుకున్న పాత్ర సత్యదేవ్‌దే నని దర్శకుడు మోహన్‌రాజా తెలిపినట్లు సమాచారం.

Also Read: Illegal affair: డ్రైవర్ తో మస్త్ మజా.. చివరికి బతుకు దగా

హీరో సత్యేదేవ్‌ తొలి నుంచి వైవిధ్యమైన పాత్రల్లో నటించి తనకంటూ ప్రేక్షక అభిమానులలో ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. అని చిత్ర యూనిట్‌ నయన్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని టాక్‌ నడుస్తోంది. అయితే స్వయంకృషితో ఎదిగిన నయనతార నిజంగా ఇలా మాట్లాడిందా లేదా ఇదంతా మధ్యలో ఎవరైనా అల్లిన కట్టు అనేది తెలియాలంటే “గాడ్ ఫాదర్” చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: Kangana: ఈ దాడితో నైనా ‘కంగనా’లో మార్పు వస్తోందా