https://oktelugu.com/

God Father Movie: మెగాస్టార్ “గాడ్ ఫాధర్” సినిమాలో నయనతార… ఏ రోల్ లో అంటే ?

God Father Movie: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం” ఆచార్య “షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు చిరు. తన తదుపరి సినిమా “భోళా శంకర్”  చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ పట్టాలు ఎక్కనుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో తారాగణం ఎవరు ఎవరో అనుకున్న తరుణంలో పూజా కార్యక్రమం రోజు తారాగణం గురించి వెల్లడించారు మేకర్స్. అయితే తాజాగా చిరంజీవి 153 సినిమా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 05:22 PM IST
    Follow us on

    God Father Movie: ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు.  ప్రస్తుతం” ఆచార్య “షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు చిరు. తన తదుపరి సినిమా “భోళా శంకర్”  చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ పట్టాలు ఎక్కనుంది. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంలో తారాగణం ఎవరు ఎవరో అనుకున్న తరుణంలో పూజా కార్యక్రమం రోజు తారాగణం గురించి వెల్లడించారు మేకర్స్. అయితే తాజాగా చిరంజీవి 153 సినిమా “గ్రాండ్ ఫాదర్ ” సినిమా గురించి మరో కొత్త అప్డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం.

    మోహన్ రాజ్ దర్శకత్వంలో మెగాస్టార్ 153 వ చిత్రంగా “గ్రాండ్ ఫాదర్”తెరకెక్కనుంది.ఈ సినిమా మలయాళ ‘లూసిఫర్’ చిత్రానికి అపీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న “గాడ్‌ఫాదర్” తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా స్వల్ప మార్పులతో ఈ సినిమా స్ర్కిప్ట్ ను తీర్చిదిద్దారు దర్శకుడు మోహన్ రాజా. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి తారాగణం స్పష్టత లేదు.  అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కోసం నయనతార, రమ్యకృష్ణ, శోభన తదితర నటుల పేర్లు వినిపించాయి. ఈ చిత్రంలోని అతి కీలకమైన ముఖ్యమంత్రి కూతురి పాత్రలో నయనతార నటిస్తోందని గతంలో వార్తలు కూడా వచ్చాయి.

    ఈ రోజు నయనతార పుట్టిన రోజు తరుణంలో నయనతారకు శుభాకాంక్షలు తెలుపుతూ “గాడ్‌ఫాదర్” టీమ్ ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి కూతురి పాత్రలో నయనతార నటించనున్నట్లు అర్ధమవుతోంది. ఈ సినిమా లో చిరంజీవికి సోదరి పాత్రలో నటిస్తున్నారు ఈ అమ్మడు అలానే చిరంజీవికి తమ్ముడి పాత్రలో సత్యదేవ్ , మరో కీలక పాత్రలో మురళి మోహన్ నటిస్తున్నారు.