https://oktelugu.com/

Actress Nayanathara: మరోసారి అందర్నీ భయపెట్టి ” కనెక్ట్ ” అయ్యేందుకు రెడీ అంటున్న… నయనతార

Actress Nayanathara: నయనతార గురించి కొత్తగా అపరికాయమ్ చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి.  తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అగ్ర హీరోలందరితో నటించి ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు నయన్. అలానే లేడీ ఓరియెంటెడ్ పాత్రలో సక్సెస్ అయ్యి దాదాపు 80 చిత్రాలకు పైగా నటించి విజయ బాటలో దూసుకు వెళుతూ సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. కాగా నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ […]

Written By: , Updated On : November 18, 2021 / 06:44 PM IST
Follow us on

Actress Nayanathara: నయనతార గురించి కొత్తగా అపరికాయమ్ చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి.  తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో అగ్ర హీరోలందరితో నటించి ఎంతోమంది అభిమానులు సొంతం చేసుకున్నారు నయన్. అలానే లేడీ ఓరియెంటెడ్ పాత్రలో సక్సెస్ అయ్యి దాదాపు 80 చిత్రాలకు పైగా నటించి విజయ బాటలో దూసుకు వెళుతూ సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగారు. కాగా నయనతార నాయికగా నటించిన 50వ చిత్రం ‘మాయ’. 2015లో విడుదలైన ఈ తమిళ సినిమా తెలుగులో ‘మయూరి’ పేరుతో డబ్ అవ్వగా… కన్నడలో కూడా రీమేక్ అయ్యింది. మూడు భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది.

actress nayan new movie connect poster released

ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడు అశ్విన్ శరవణ మరోసారి నయనతారను డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఈ సారి వీరిద్దరి కాంబినేషన్ లో మరో హారర్ మూవీని దర్శక నిర్మాత, నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ నిర్మించబోతుండటం విశేషం. విఘ్నేష్ సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. నయనతార పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను విఘ్నేష్ ప్రకటించాడు. ‘కనెక్ట్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ మూవీలో సీనియర్ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ తో పాటు సత్యరాజ్ కీలక పాత్ర పోషించబోతున్నాడు.

ఇటీవల దీపావళి కానుకగా విడుదలైన” పెద్దన్న “సినిమా లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన తన నటనతో మెప్పించారు నయనతార. ప్రస్తుతం విజయ్ సేతుపతి తో “కాతు వాకుల రెండు కాదల్ “షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో సింహ మూవీ లో నటించనుంది ఈ ముద్దుగుమ్మ. అలానే మెగాస్టార్ చిరంజీవి “గాడ్ ఫాదర్” సినిమాలో కూడా నటిస్తున్నాట్లో ఈరోజు మూవీ యూనిట్ ప్రకటించింది.