https://oktelugu.com/

Hero Simbu: “మానాడు” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకున్న హీరో శింబు…

Hero Simbu: తమిళ స్టైలీష్‌ స్టార్‌ శింబు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘మానాడు’. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి’ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ఈ సినిమాలో  […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 18, 2021 / 06:32 PM IST
    Follow us on

    Hero Simbu: తమిళ స్టైలీష్‌ స్టార్‌ శింబు, క్రియేటివ్‌ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘మానాడు’. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ‘సురేష్ కామాచి’ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో శింబుకి జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తుంది. ప్రముఖ దర్శకులు భారతీరాజా, ఎస్.జె. సూర్య, ఎస్. ఎ. చంద్రశేఖర్, ప్రేమ్ జి అమరన్ ఈ సినిమాలో  ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తాజాగా చెన్నైలో ‘మానాడు’ మూవీ ప్రీ – రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.

    actor simbu crying in maanaadu movie pre release event

    అయితే అందులో ప్రస్తుతం తాను ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను తలచుకుని స్టేజి మీద శింబు కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తున్నట్టు సపోర్ట్ చేయాలని అభిమానులను రిక్వెస్ట్ చేశారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆడిటోరియం నుంచి రోరింగ్ రెస్పాన్స్ లభించింది. “అన్నా… మేమెప్పుడూ నీతో ఉంటాం. వుయ్ లవ్యూ” అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ‘సరోజ’, ‘గ్యాంబ్లర్’, ‘బిర్యానీ’ సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.

    ఈ ఈవెంట్ లో నటుడు ఎస్.జె. సూర్య తెలుగులో డైలాగు చెప్పి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఇందుకు గాను అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా ‘గ్యాంబ్లర్’ రేంజ్ అని నిర్మాత ధనుంజయన్ చెప్పారు. సినిమా కథ నేరేట్ చేసిన తర్వాత వెంకట్ ప్రభును హగ్ చేసుకుని, దీనికి ఇంటెర్నేషల్ అప్పీల్ ఉందని చెప్పానని ఎస్.జె. సూర్య అన్నారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శింబు ముస్లింగా నటిస్తుండడం గమనార్హం.