Homeఎంటర్టైన్మెంట్Actress Meena Sagar: ఏమండోయ్.. మీనాకి అవి బాగా ఇంట్రెస్ట్ అట...

Actress Meena Sagar: ఏమండోయ్.. మీనాకి అవి బాగా ఇంట్రెస్ట్ అట !

Actress Meena Sagar: హెడ్డింగ్ చూసి తప్పుగా అర్ధం చేసుకోవద్దు. మీనా తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో బోలెడు విషయాలు చెప్పుకొచ్చింది. మీనాకి ఇప్పటికీ లవ్ లెటర్స్ వస్తున్నాయట. ఆ విషయం ఆఫ్ ది రికార్డ్ సిగ్గుపడుతూ చెప్పింది. ఆ లెటర్స్ చూసుకున్నప్పుడు తనకు నవ్వు వస్తోందని.. పెళ్లి అయి కూతురు పుట్టినా తనను ఇంకా ఎంతోమంది ఇష్టపడుతుండటం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని మీనా చెప్పుకొచ్చింది.

Actress Meena Sagar
Actress Meena Sagar

ఇక ఈ సందర్భంగా మీనా మిగిలిన అంశాల పై కూడా మనసులోని ముచ్చట్లును చెప్పింది. మరి ఆ ముచ్చట్లు ఏమిటో మీనా మాటల్లోనే విందాం. ‘సీనియర్ హీరోయిన్ అనగానే ఇక వదిన, అక్క, అమ్మ పాత్రలకు మాత్రమే పనికొస్తారు అని ఎప్పటి నుంచో మేకర్స్ లో ఒక బలమైన ఆలోచన ఉండిపోయింది. కానీ అది పూర్తిగా తప్పు. నాకు అయితే అలాంటి పాత్రలు పోషించాలని అసలు లేదు.

Also Read: Drushyam 2 Telugu Movie Review: దృశ్యం2 రివ్యూ

నేను ఇంకా మంచి పాత్రలను, అవసరం అనుకుంటే ఇంకా మెయిన్ లీడ్ పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తాను. ఆ మధ్య నా దగ్గరకు ఒక వెబ్ సిరీస్ వచ్చింది. అది బోల్డ్ వెబ్ సిరీస్. భర్తకి దూరం అయిన ఓ స్త్రీకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు కారణంగా ఆమె చిన్న పొరపాటు చేస్తే.. ఆ పొరపాటును చూపించి చుట్టూ ఉన్న జనం ఆమెను ఎన్ని రకాలుగా వాడుకుంటారో చెప్పే కథ అది.

Actress Meena
Actress Meena

నాకు ఆ కథ బాగా నచ్చింది. నాకైతే కాస్త ఆసక్తికరంగా, కొత్తగా ఉండే పాత్రలు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది’ అంటూ మీనా ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పుకుంటూ పోయింది. మరి మీనా మనసులోని కోరికలను విన్నారు కాబట్టి.. ఇక నుండైనా మీనా కోసం రచయితలు దర్శకులు కొత్త కొత్త విభిన్న పాత్రలను, బోల్డ్ కథలను రాయాలని రాస్తారని ఆశిద్దాం.

Also Read: Movie Reviews: రివ్యూలు సినిమాలకు మేలు చేయాలంటే అలా చేయండి !

అన్నట్టు మీనాకు పాట పాడాలని కూడా బాగా ఆసక్తిగా ఉందట. ఆ సంగతి కూడా మీనా చెబుతూ.. ‘పాటలంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. నేను సరదాగా అప్పుడప్పుడు పాడుతుంటాను కూడా. సినిమాల్లో కూడా నాకు పాడాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది. మరి కీరవాణి గారో, తమన్ గారో నాకు పాట పాడే అవకాశం ఇస్తారేమో చూడాలి’ అని మీనా నవ్వుతూ చెప్పింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular