kalyan Ram: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ చిత్రం అఖండ. కాగ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. కాగ ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… ప్రగ్యా జైస్వాల్ బాలయ్యకు జోడీగా నటించనుంది. అంతేకాక ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి జై బాలయ్య పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

ఈ మూవీకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన జై బాలయ్య సాంగ్ కి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. తాజాగా ఈ పాటపై నందమూరి కళ్యాణ్ రామ్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా చేశారు. ఈ ట్వీట్ లో జై బాలయ్య, బాబాయ్ ఫుల్ ఫ్లో లో ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. మాస్ జాతర ను డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ల లో చూసేందుకు ఆగలేకపోతున్నట్లు తెలిపారు. నిన్ననే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Jai Balayya !!
Babai in full flow !!
Can’t wait for the mass jathara in theaters from Dec 2nd.
– https://t.co/20SauR6e4E#Akhanda
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 28, 2021