Jai Bhim: ఆ సినిమా కోసం వారితో కలిసి ఎలుకలు పట్టడానికి కూడా వెళ్ళాను అంటున్న… నటి లిజోమోల్

Jai Bhim: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్​. ఇటీవలే అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు. 1993 లో తన భర్త కోసం ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ బరీ వారి పాత్రలకు […]

Written By: Sekhar Katiki, Updated On : November 21, 2021 5:07 pm
Follow us on

Jai Bhim: తమిళ స్టార్​ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటించిన సినిమా జై భీమ్​. ఇటీవలే అమెజాన్​ ప్రైమ్​లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి టి. జ్ఞానవేల్​ దర్శకత్వం వహించారు. సూర్య తన సొంత బ్యానర్​పై ఈ సినిమాను నిర్మించారు. 1993 లో తన భర్త కోసం ఓ గిరిజన మహిళ చేసిన పోరాటం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ బరీ వారి పాత్రలకు ప్రాణం పోశారని చెప్పాలి. చంద్రు పాత్రకు సూర్య జీవం పోశారు. కాగా, గిరిజన మహిళ పాత్రలో నటి లిజోమోల్​ నటించింది. ఇందులో నటించిన అందరికి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా సినతల్లి పాత్రలో నటించిన లిజోమోల్ జొస్ కి అందరి అభినందనలు దక్కుతున్నాయి.

అంతకు ముందు కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించిన ఈమె ఈ సినిమాలో డి గ్లామర్ రోల్ లో అందర్నీ అలరించింది.  ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి లిజోమోల్ జోస్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని ఇటివల ఓ తమిళ మీడియాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో తెలిపింది. ‘జై భీమ్’ సినిమా క‌థ‌ను డైరెక్ట‌ర్ జ్ఞాన‌వేల్ చెప్ప‌గానే పాత్ర‌లోని భావం అర్థమైంది. ఇదెంత కష్టమైన పాత్రో అర్ధం చేసుకొని దాని కోసం చాలా హార్డ్ వర్క్ చేశాను. ఇటువంటి పాత్ర కోసం ఎంతైనా క‌ష్ట‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అందుకోసం డైటింగ్ చేసి బ‌రువు కూడా త‌గ్గాను అని చెప్పింది.
ఇందులో నేను చేసింది గిరిజ‌న స్త్రీ పాత్ర‌ కాబ‌ట్టి గిరిజ‌న తెగ‌కు చెందిన మ‌హిళ‌ల‌ను క‌లుసుకుని వారితో కొన్ని రోజ‌లు గ‌డిపాను. వాళ్లు ఎలా ఉంటారు? ఏం తింటారు? అన్ని రీసెర్చ్ చేశాను. అంతే కాకుండా వారితో క‌లిసి ఎలుక‌లు ప‌ట్ట‌డానికి కూడా వెళ్లి, వాళ్ళు ఎలా ప‌డుతున్నారో చూసి నేను కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాను. ఒకసారి ఎలుక మాంసం కూడా తిన్నాను. ఇలా ఎన్ని చేసినా ఆ పాత్ర కోసమే చేశాను. సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ప్రశంశలు చూసి నేను పడ్డ కష్టం అంతా మర్చిపోయాను అని తెలిపింది లిజో మోల్ జోస్.