1 Crore Loan: ఎలాంటి షూరిటీ లేకుండా రూ. కోటి రూపాయల లోన్..

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన Stand Up India పథకం ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా కోటి రూపాయల లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వారితో పాటు మహిళల వారికి కొత్త వ్యాపారానికి లోన్ సదుపాయం కల్పిస్తారు.

Written By: Srinivas, Updated On : May 3, 2024 11:17 am

bank loan

Follow us on

1 Crore Loan: ఉద్యోగం చేయాలని కొందరు అనుకుంటే వ్యాపారం చేయాలని మరికొందరు అనుకుంటారు. ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, ఛాలెంజింగ్ ను తీసుకునేవారు బిజనెస్ లో బాగా రాణిస్తారు. అయితే వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి సరైన మూలధనం కొందరికి ఉండదు. దీంతో బ్యాంకులో లోన్ తీసుకొని వ్యాపారం చేయాలనుకుంటారు. కానీ బ్యాంకులు ఏ షూరిటీ లేకుండా లోన్ ఇవ్వడానికి ముందుకు రావు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకు సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా రూ. కోటి వరకు రుణ సాయం చేస్తుంది. ఆ స్కీం వివరాల్లోకి వెళితే..

బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. కానీ కొందరికి ప్రోత్సాహం తక్కువే ఉంటుంది. వ్యాపారంలో రాణించాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవాలి. పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుందనే నమ్మకం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి పెట్టడానికి సాహసం చేయరు. అయితే బ్యాంకు లోన్ తీసుకోవాలనుకుంటారు. కానీ షూరిటీ లేకుండా బ్యాంకు లోన్ ఇవ్వడం కష్టమే. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన Stand Up India పథకం ద్వారా ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంకు ద్వారా కోటి రూపాయల లోన్ తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ వారితో పాటు మహిళల వారికి కొత్త వ్యాపారానికి లోన్ సదుపాయం కల్పిస్తారు. అయితే వీరు చేసే వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంద. ఇవి మాన్యుఫ్యాక్చరింగ్, సేవా, ట్రేడింగ్ రంగాలతో పాటు వ్యవసాయ ఆధారిత బిజినెస్ స్టార్ట్ చేసేవారు ఈ పథకానికి అర్హులు. అందువల్ల కొత్తగా వ్యాపారం ప్రారంభించుకునే వారు ఈ పథకం ద్వారా లోన్ తీసుకోని పెట్టుబడిగా పట్టవచ్చు.