https://oktelugu.com/

జూనియర్ ఆర్టిస్ట్ పై లావణ్య కేసు.. కారణం ఇదే..

సోషల్ మీడియా లో పాపులర్ అవ్వడానికి కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తుండటం మనం చూస్తున్నదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో సునిశిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ తెగ ట్రెండ్ అవుతున్నాడు. ప్రతి విషయంలో తనకు అవగాహన ఉందని, బాహుబలి సినిమాలో పాటలు పాడానని, తనకు అన్ని విషయాలు తెలుసు చెప్తూ పాపులర్ కావడానికి ఒకదానితో మరొకటి సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుతూ […]

Written By: , Updated On : March 17, 2020 / 06:30 PM IST
Follow us on

సోషల్ మీడియా లో పాపులర్ అవ్వడానికి కొంతమంది పిచ్చిపిచ్చి పనులు చేస్తుండటం మనం చూస్తున్నదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతమంది విచక్షణ మరిచి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల కాలంలో యూట్యూబ్ లో సునిశిత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ తెగ ట్రెండ్ అవుతున్నాడు. ప్రతి విషయంలో తనకు అవగాహన ఉందని, బాహుబలి సినిమాలో పాటలు పాడానని, తనకు అన్ని విషయాలు తెలుసు చెప్తూ పాపులర్ కావడానికి ఒకదానితో మరొకటి సంబంధం లేని విషయాలను గురించి మాట్లాడుతూ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాడు. పాపులర్ కావాలి అనుకోవడం మంచిదే. కానీ, అవసరం లేని విషయాలను గురించి కూడా ఏదో కావాలి అనుకుంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది.

ఇటీవలే కొన్ని యూట్యూబ్ చానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ, లావణ్య త్రిపాఠికి వివాహం జరిగిందని మాట్లాడాడు. అంతేకాదు, లావణ్యతో ఎఫైర్ ఉందని, తమన్నాతో కూడా ఎఫైర్ ఉందని సునిశిత్ మాట్లాడాడని చెప్పి లావణ్య త్రిపాఠి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. నటి లావణ్య ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. గతంలో ఈ జూనియర్ ఆర్టిస్ట్ నటుడు, యాంకర్ ప్రదీప్ పై కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.