సరిహద్దుల్లో కూడా మూత బడ్డ థియేటర్లు

ఒక పక్క కరోనా దెబ్బకి దేశంలోని పలు రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తుండగా తమిళనాడు మాత్రం ఇంకా బింకంగా తెరిచే ఉంచింది. అయినా దానివల్ల ఉపయోగం ఏమి కనపడటం లేదు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ కుదేలవ్వగా మన పొరుగున ఉన్న కోలీవుడ్ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానికి ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు.. తమిళనాడులో ఈ శని, ఆదివారాలలో థియేటర్స్ జనం లేక వెల వెల పోయాయి. […]

Written By: Neelambaram, Updated On : March 18, 2020 1:46 pm
Follow us on

ఒక పక్క కరోనా దెబ్బకి దేశంలోని పలు రాష్ట్రాలు సినిమా హాళ్లను మూసివేస్తుండగా తమిళనాడు మాత్రం ఇంకా బింకంగా తెరిచే ఉంచింది. అయినా దానివల్ల ఉపయోగం ఏమి కనపడటం లేదు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమ కుదేలవ్వగా మన పొరుగున ఉన్న కోలీవుడ్ వాళ్ళు దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానికి ఇపుడు ఫలితం అనుభవిస్తున్నారు.. తమిళనాడులో ఈ శని, ఆదివారాలలో థియేటర్స్ జనం లేక వెల వెల పోయాయి. మిగతా రోజులలో థియేటర్స్ వద్ద ప్రేక్షకులు కనిపించనప్పటికీ వీకెండ్ లో అధికంగా కనిపిస్తారు. అలాంటిది కరోనా కారణంగా అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాల సరిహద్దులను ఆనుకొని ఉన్న 16 జిల్లాలోని థియేటర్స్ మూసివేశారు. తేనీ, కన్యాకుమారి, తిరుప్పూరు, కోయంబత్తూరు, నీలగిరి, కృష్ణగిరి, తిరునెల్వేలి, తెన్కాశి, తిరువళ్ళూరు, వేలూర్‌, తిరుపత్తూరు, రాణిపేట, ఈరోడ్‌, దిండుక్కల్‌, ధర్మపురి, విరుదునగర్‌ జిల్లాల్లోని అన్ని థియేటర్లలను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దాంతో సగం తమిళ నాడులో సినిమా పరిశ్రమ కుంటువడింది. ఇక ఇలాంటి టైం లో తమ చిత్రాలకు కలెక్షన్ రాదని తెలుసుకొన్నతమిళ స్టార్ హీరోలు చియాన్ విక్రమ్, ఆవారా ఫేమ్ కార్తీ లు నటించిన భారీ చిత్రాలు కోబ్రా, సుల్తాన్ వాయిదా వేయక తప్పలేదు.
Think before you leap