https://oktelugu.com/

Kasthuri Shankar: అవకాశాల కోసం పడుకోవాల్సిందే.. సింగర్ చిన్మయి వద్ద ఆధారాలు లేవు, కస్తూరి కీలక కామెంట్స్

కస్తూరి తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై కీలక కామెంట్స్ చేసింది. కస్తూరి మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమలో ఉంది. అన్ని పరిశ్రమలలో కూడా ఉంటుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 19, 2024 / 01:32 PM IST

    Kasthuri Shankar reacts singer chinmayi Vairamuthu me too issue

    Follow us on

    Kasthuri Shankar:  రెండు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో ఉంది నటి కస్తూరి శంకర్. నాగార్జున నటించిన ఇండస్ట్రీ హిట్ అన్నమయ్య మూవీలో కస్తూరి నటించింది. అన్నమయ్య భార్యల్లో ఒకరిగా ఆమె కనిపించారు. కమల్ హాసన్ నటించిన భారతీయుడు మూవీలో కస్తూరి సిస్టర్ రోల్ చేసింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉంది. కస్తూరి తాజా ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ పై కీలక కామెంట్స్ చేసింది. కస్తూరి మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్ చిత్ర పరిశ్రమలో ఉంది. అన్ని పరిశ్రమలలో కూడా ఉంటుంది.

    నాకు కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కానీ వాళ్ళ పేర్లు నేను బయటపెట్టలేదు. సింగర్ చిన్మయి రచయిత వైరముత్తు మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. వ్యక్తిగతంగా వైరముత్తు నాకు తెలుసు. ఆయన చాలా విషయాల్లో నాకు మద్దతుగా నిలిచాడు. నా ముక్కుసూటితనం ఆయనకు ఇష్టం. నాకు తెలిసి వైరముత్తు మంచి వ్యక్తి. ఒకరిపై ఆరోపణలు చేయడానికి ధైర్యం తో పాటు ఆధారాలు కూడా ఉండాలి. చిన్మయి వద్ద ఆధారాలు లేవు.

    వ్యక్తిగా చిన్మయి మంచి అమ్మాయి. చిన్న వయసులో తనకు ఎదురైన సంఘటనలను ఆమె తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. ఒకరిపై ఆరోపణలు చేయడంలో తప్పులేదు. కానీ ఆధారాలతో చేయాలి. ఇలాంటి వాటిని అమెరికాలో అయితే సమర్థిస్తారు. సపోర్ట్ చేస్తారు. ఇండియాలో సాక్ష్యాలు ఉండాల్సిందే… అని కస్తూరి అన్నారు. మలయాళ పరిశ్రమలో ఒక భారీ ప్రాజెక్ట్ విషయంలో మోసపోయానని ఆమె అన్నారు. పరోక్షంగా ఆఫర్స్ కోసం బెడ్ షేర్ చేసుకునే చెడు సాంప్రదాయం పరిశ్రమలో ఉందని చెప్పకనే చెప్పింది.

    అదే సమయంలో వైరముత్తు మీద సింగర్ చిన్మయివి ఆరోపణలు మాత్రమే. ఆధారాలు లేవని ఆమె ఎద్దేవా చేసింది. చాలా ఏళ్లుగా వైరముత్తు మీద చిన్మయి యుద్ధం చేస్తుంది. పలువురు అమ్మాయిల మీద వైరముత్తు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అనేది ఆమె ఆరోపణ. ఆయన మీద కేసులు కూడా పెట్టింది. కానీ వైరముత్తుకు పరిశ్రమలో బలమైన రిలేషన్స్ ఉన్నాయి. రాజకీయంగా కూడా పరిచయాలు ఉన్న వ్యక్తి. వైరముత్తు మీద పోరాటంలో చిన్మయి కెరీర్ కోల్పోయింది. కోలీవుడ్ ఆమెను దూరం పెట్టింది.