Karate Kalyani: కరాటే కళ్యాణి మరోమారు వార్తల్లో నిలిచారు. ఆమె తనకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. కొందరు నన్ను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ప్రయత్నం కూడా జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కరాటే కళ్యాణి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సస్పెన్షన్ గురైంది. ఖమ్మంలో గల లకారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును కరాటే కళ్యాణి వ్యతిరేకించారు. ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుడు రూపంలో ఉన్న నేపథ్యంలో యాదవ సంఘాలు దీన్ని అడ్డుకున్నాయి. కోర్టుకి వెళ్లి విగ్రహ ఏర్పాటు ఆపేలా చేశారు.
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకంగా మాట్లాడిన కరాటే కళ్యాణిపై మా సీరియస్ అయ్యింది. ఆమెకు షోకాజ్ నోటీసులు పంపారు. ఆమె ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదంటూ సస్పెండ్ చేశారు. నాకు పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే సమయం కూడా ఇవ్వలేదు. రెండు మూడు రోజుల సమయం మాత్రమే ఇచ్చారు. నేను అనారోగ్యంతో బాధపడుతూ ఓ వ్యక్తితో సమాధానం పంపాను. నేను టాలీవుడ్ తరపున అనేకమార్లు మాట్లాడాను. విమర్శలు ఎదుర్కొంటూ నా గళం వినిపించాను.
అందుకు మా నాకు మంచి బహుమతి ఇచ్చింది. ఈ సస్పెన్షన్ నన్ను తీవ్ర వేదనకు గురి చేసిందని కరాటే కళ్యాణి అన్నారు. తాజాగా ఆమె హత్యాయత్నం ఆరోపణలు చేశారు. నా కారు టైర్స్ ఉద్దేశపూర్వకంగా ఎవరో కట్ చేశారు. నేను ప్రయాణం చేస్తున్న సమయంలో అవి పేలిపోయాయి. అదృష్టవశాత్తు ఏం కాలేదు. టైర్లను పరిశీలించిన మెకానిక్ ఎవరో కావాలనే కోశారని చెప్పాడు. నాకు ప్రాణహాని ఉంది. కొందరు చంపే ప్రయత్నం చేస్తున్నారని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.
కరాటే కళ్యాణి కామెంట్స్ కాకరేపుతున్నాయి. ఇక కరాటే కళ్యాణి జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి. గత ఏడాది ఓ యూట్యూబర్ ని రోడ్డుపై కొట్టింది. పెద్ద న్యూసెన్స్ కావడంతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన అనుమతులు లేకుండా కరాటే కళ్యాణి ఓ పాపను పెంచుతున్నారని అధికారులు దాడులు చేశారు. అనంతరం ఆ పాప తల్లిదండ్రులతో పాటు కరాటే కళ్యాణి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చింది.