Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu : చంద్రబాబు...

Chandrababu : చంద్రబాబు పెద్ద ప్లాన్.. ఎన్నికలకు ముందే సాహసం

Chandrababu : నగదు బదిలీ పథకం గుర్తుంది కదూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బలంగా వినిపించిన మాట ఇది. అంటే రేషన్, గ్యాస్ సరఫరా, విద్యుత్ చార్జీలు వంటి విషయంలో ప్రభుత్వ రాయితీ బదులు నగదు బదిలీ చేస్తామన్న ప్రతిపాదనలు వచ్చాయి. 2009 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో కూడా నగదు బదిలీ పథకం గురించి ప్రస్తావించారు.  నారా లోకేష్ ఈ మేనిఫెస్టో తయారీలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో యాక్టివ్ కాకపోయినప్పటికీ ఆయన చేసిన ప్రయత్నం అప్పట్లో  అందర్నీ ఆకట్టుకుంది. టీడీపీ అధికారంలోకి వస్తే.. నగదు బదిలీ చేస్తామని కుప్పంలో ఇలా లబ్దిదాుల కార్డుల్ని కూడా పంచారు. కానీ ఆ నగదు బదిలీ హామీలకు టైమింగ్ మిస్సయింది. ఈ సారి మాత్రం  టీడీపీ మేనిఫెస్టోకు నగదు బదిలీ పథకాన్ని అనుసంధానించనున్నారు.

టీడీపీ గతంలో సంక్షేమ పథకాలు అమలుచేసినా ఈ స్థాయిలో దుబారా చేసిన దాఖలాలు లేవు. చాలా రకాల పథకాలు అమలుచేశారు. చేతి వృత్తుల వారికి, నిరుద్యోగ యువతకు, వెనుకబడిన వర్గాల వారికి అమలుచేసి వారికి ఉపాధినిచ్చారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఉచిత పథకాలను అడ్డూ అదుపు లేకుండా అమలుచేశారు. దీంతో చంద్రబాబు సైతం అంతకు మించి సంక్షేమ పథకాలు అమలుచేయాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది. అందుకే మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోను ప్రకటించారు.

అయితే టీడీపీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలను ఆపేస్తారని వైసీపీ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. సంక్షేమం విషయంలో చంద్రబాబు ఫెయిల్యూర్స్ ను చూపే ప్రయత్నం చేస్తోంది. గతంలో జరిగిన తప్పిదాలను గుర్తుచేస్తోంది. అయితే  జగన్ ఇవ్వగా లేనిది… సంపద సృష్టించే చంద్రబాబు ఎందుకు ఇవ్వలేరని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.  ఈ లాజిక్ కూడా తేలిపోవడంతో మేనిఫెస్టో కాపీ అంటూ కొత్త విమర్శలు చేస్తున్నారు. కానీ టీడీపీ మాత్రం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. తమ పథకాల లబ్దిదారులకు ముందుగానే ఎంపిక చేసి వారికి కార్డులు పంచబోతోంది.

వాస్తవానికి జగన్ ఇచ్చిన హామీలకు లెక్కే లేదు. విపక్ష నేతగా ఉన్నప్పుడు దారిపొడవునా అన్నివర్గాల వారికి హామీలు మీద హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరచి కేవలం నవరత్నాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి మంది కూడా ఉండని లబ్దిదారులతో పథకాలు లాగేస్తున్నారు.. చివరికి విదేశీ విద్యా దీవెన పథకానికి… బడుగు, బలహీనవర్గాల పెళ్లిళ్లకు ఇచ్చే సాయానికి కూడా ఊహించని షరతులు పెట్టి… లబ్దిదారుల్ని తగ్గించేశారు. అందుకే టీడీపీ ప్రభుత్వం కొత్తగా ఆలోచించింది. అర్హుల పేరుతో ఎవర్నీ ఎలిమినేట్ చేయబోమని… నమ్మకం కలిగించేందుకు ముందుగానే కార్డులు ఇవ్వాలని నిర్ణయించుకుంది. టీడీపీ తాజా నిర్ణయంతో వైసీపీ శ్రేణుల నోటీలో పచ్చి వెలక్కాయ పడినట్టయ్యింది.

Get notified whenever we post something new!

Continue reading

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు. స్పీకర్ వంటి రాజ్యాంగబద్ధ పదవిని చేపట్టారు. అటువంటి నేత అరెస్టు భయంతో ఇప్పుడు కుటుంబ సభ్యులతో సహా...

AP School Hair Cut Rules: విద్యార్థులకు సరికొత్త హెయిర్ స్టైల్స్.. అలా వస్తామంటే కుదరదు!

AP School Hair Cut Rules: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు తల్లికి వందనం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ పరిస్థితుల్లో పిల్లల విషయంలో మరో నిర్ణయం ప్రకటించింది. ఏపీలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న బాలురుకు ఒకే తరహాలో హెయిర్ కట్ విధించాలని విద్యాశాఖ కొత్త మార్గదర్శకాలను...

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల చేసే అర్హుల జాబితాను గ్రామ/ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. మరోవైపు ఈ ఏడాది లబ్ధిదారుల సంఖ్య పెరగనుంది. కొత్తగా...

Enjoy exclusive access to all of our content

Get an online subscription and you can unlock any article you come across.

Enjoy the benefits of exclusive reading

Exit mobile version