https://oktelugu.com/

Kajal Agarwal: ఫస్ట్ టైమ్ ఆ ఫోటోని షేర్ చేసిన కాజల్ అగర్వాల్… అభిమానులు ఫిదా ?

Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ… కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన  లక్ష్మి కళ్యాణం సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత  ‘చందమామ’ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది కాజల్. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలో తన చిన్ననాటి స్నేహితుడు, […]

Written By: , Updated On : January 4, 2022 / 01:06 PM IST
Follow us on

Kajal Agarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న భామ… కాజల్ అగర్వాల్. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన  లక్ష్మి కళ్యాణం సినిమాలో నటించి తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఆ తర్వాత  ‘చందమామ’ మూవీతో అందరి దృష్టిని ఆకర్షించింది కాజల్. ఇక అనంతరం వరుస విజయాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు అగ్ర హీరోల సరసన ఆడిపాడింది. సినిమాల్లో బిజీగా ఉన్న తరుణంలో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్‌ను 2020 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకుంది కాజల్.

actress kajal agarwal baby bump photos viral on social media

కాగా తల్లి కాబోతుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. గర్భవతి అయిన కారణంగానే ఆమె కొన్ని సినిమాల నుంచి తప్పుకుందంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. ఇటీవల  న్యూ ఇయర్‌ సందర్భంగా కౌజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశాడు. ఈ కొత్త సంవత్సరంలో నీ రాక కోసం ఎదురు చూస్తున్నామంటూ గర్భవతి మహిళ ఎమోజీని క్యాప్షన్‌తో ఓ ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో కాజల్‌ దంపతులకు అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ఇప్పుడు తాజాగా కాజల్‌ తొలిసారిగా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. ఈ పోస్ట్ లో 2022 అంటూ లవ్‌ సింబల్‌ను యాడ్‌ చేసింది. ఈ ఫోటోలో కాజల్‌ బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం కాజల్‌ మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక భారతీయుడు 2, ఘోస్ట్ సీనిమాల నుంచి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.