https://oktelugu.com/

RGV Romantic Dance : హీరోయిన్ తో రాంగోపాల్ వర్మ మరో రోమాన్స్.. వైరల్ వీడియో

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అమ్మాయిలతో తన ఫ్లాట్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఒక అమ్మాయితో రోమాంటిక్ డ్యాన్స్ చేస్తూ వీడియోలకు చిక్కిన రాంగోపాల్ వర్మ తాజాగా మరో అమ్మాయితో ఇదే పనిచేస్తూ వీడియోలో చిక్కాడు. తన జీవితం తన ఇష్టం అంటూ వర్ధమాన హీరోయిన్లతో రోమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వర్మ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వర్మ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 27, 2021 / 02:51 PM IST
    Follow us on

    వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం అమ్మాయిలతో తన ఫ్లాట్ లో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇటీవలే ఒక అమ్మాయితో రోమాంటిక్ డ్యాన్స్ చేస్తూ వీడియోలకు చిక్కిన రాంగోపాల్ వర్మ తాజాగా మరో అమ్మాయితో ఇదే పనిచేస్తూ వీడియోలో చిక్కాడు.

    తన జీవితం తన ఇష్టం అంటూ వర్ధమాన హీరోయిన్లతో రోమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్న వర్మ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు వర్మ మార్క్ అరాచకం నడుస్తోంది.

    తాజాగా ఇనాయా సుల్తానా అనే ఓ యువతి వర్మతో హాట్ హాట్ డ్యాన్స్ చేసి స్టెప్పులు వేస్తూ రచ్చ చేసింది. ఆ వీడియోను స్వయంగా ఆమెను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వర్మ ఇందులో కాస్త హద్దులు మీరి ప్రవర్తించి ఆమెను హత్తుకోవడం.. ముద్దులు పెట్టుకోవడం.. రోమాన్స్ చేయడం కనిపించింది.

    ఇనాయా సుల్తానా పుట్టినరోజు వేడుకల్లో జరిగిన పార్టీలో వర్మ ఈ రచ్చ చేశాడట.. వర్మతో డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసిన సుల్తానా.. ‘నేను, రాంగోపాల్ వర్మ కలిసి డ్యాన్స్ చేసిన వీడియోను.. అధికారికంగా నేను షేర్ చేస్తున్నాను’ అంటూ క్యాప్షన్ జోడించింది.దీంతో యువతి ఇష్టంతోనే ఈ కథ అంతా నడిచిందని తెలుస్తోంది.

    రాంగోపాల్ వర్మతో తాజాగా డ్యాన్స్ చేసిన ఇనాయా సుల్తానా అప్ కమింగ్ నటి. వర్మ దర్శకత్వంలో త్వరలో రాబోతున్న సినిమాలో ఈమె నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘అవ్యోం జగత్’ మూవీలోనూ నటిస్తోంది. ‘బుజ్జి ఇలారా’ చిత్రంలోనూ ఈమె నటిస్తోందని తెలిసింది.