Arya Babu: మలయాళ బుల్లితెర నటి ఆర్య గురించి చాలా మందికి తెలుసు. ఈ అమ్మడు అందం, నటనతో ఇప్పటికే బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదట సీరియల్స్ లో నటించి తన కెరీర్ ను ప్రారంభించిన వెండితెరపై కూడా పలు సినిమాల్లో నటించింది. ఇక మలయాళ బిగ్ బాస్ సీజన్ -2లో కూడా పాల్గొంది. వీటితో పాటు బడాయి బంగ్లా, స్టార్ మ్యూజిక్ లాంటి రియాలిటీ షోలలో కనిపించింది. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో పాల్గొన తన కెరీర్ కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ముఖ్యంగా తన భర్త రాహుల్ సుశీలన్ తో విడిపోవడానికి కారణాలు ఏంటి అనే విషయాల గురించి వివరించింది ఈ నటి. ఐదేళ్ల తర్వాత తొలిసారి తన విడాకులపై స్పందించింది ఆర్య. అయితే తను బిగ్ బాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి తన భర్తనే ప్రోత్సహించారట కూడా. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ.. అదే విషయాన్ని ఆలోచిస్తే తనకు కొన్ని అనుమానాలు వస్తున్నాయని తెలిపింది. తన భర్త కావాలనే బిగ్ బాస్ కు పంపి తనను వదిలించుకోవాలి అనుకున్నాడంటూ అనుమానం వ్యక్తం చేస్తోంది.
తన తండ్రి రీసెంట్ గా చనిపోయారని.. తనకు ఒక కుమార్తె ఉందని తెలిపింది. అయితే ఈమెను బిగ్ బాస్ కు వెళ్లమని తన భర్తనే సపోర్ట్ చేసి ఎయిర్ పోర్టులో వదిలేశారట. ఇక బిగ్ బాస్ కు వెళ్లిన ఆర్యకు ఎవరితో పరిచయం లేదని.. అయితే ఆ హౌజ్ నుంచి వచ్చే లోపే చాలా విషయాలు తెలిసాయని తెలిపింది. ఆర్య బయటకు వచ్చేలోపు తనకు దూరం కావాలని తన భర్త ప్లాన్ చేసుకున్నారట. కానీ ఇదే అవకాశంగా భావిస్తున్నా అంటూ తెలిపింది ఆర్య. అయితే బిగ్ బాస్ నుంచి తిరిగి వచ్చాక చాలా సార్లు తన భర్తకు కాల్ చేసిందట.
ఎన్ని సార్లు కాల్ చేసినా కూడా తన భర్త కాల్ లిఫ్ట్ చేయలేదట. దీంతో ఏం చేయాలో తెలియక తన సోదరికి కాల్ చేసిందట. తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తెలిసిందట. దీంతో అతన్ని చంపేయాలన్నంత కోపం వచ్చిందట. కానీ ఇప్పుడు అలాంటి కోపం లేదని తెలిపింది. అంతే కాదు తనకు ఏదైనా చెడు జరిగితే సంతోషిస్తాను అంటూ వెల్లడించింది నటి ఆర్య.