https://oktelugu.com/

Maruti Suzuki Swift : 2024 స్విఫ్ట్.. అప్డేట్ ఫీచర్స్ చూస్తే దిమ్మదిరగాల్సిందే!

. రెండు సంవత్సరాలుగా స్విప్ట్ తగ్గేదేలే అన్నట్లుగా అమ్ముడుపోతున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచులు మారుతున్నందున స్విప్ట్ ను

Written By:
  • Srinivas
  • , Updated On : February 2, 2024 / 04:19 PM IST

    Maruti Swift

    Follow us on

    Maruthi Swift :   మారుతి కంపెనీ నుంచి రిలీజ్ అయిన స్విప్ట్ గురించి కారు వాడే ప్రతి ఒక్కిరిక తెలిసే ఉంటుంది. అత్యధికంగా విక్రయాలు జరుపుకున్న మోడళ్లలో స్విప్ట్ మొదటి స్థానంలో నిలుస్తుంది. రెండు సంవత్సరాలుగా స్విప్ట్ తగ్గేదేలే అన్నట్లుగా అమ్ముడుపోతున్నాయి. అయితే వినియోగదారుల అభిరుచులు మారుతున్నందున స్విప్ట్ ను అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకురానున్నారు. పాత స్విప్ట్ కంటే కొత్త కారులో ఇంజిన్ తో పాటు కొన్ని ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి 2024 స్విప్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా. అయితే వివరాల్లోకి వెళ్లండి..

    2024 స్విప్ట్ ను ఇప్పటికే జపాన్ మార్కెట్లో ఆవిష్కరించారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కొత్త స్విప్ట్ మూడు వేరియంట్లలో లభించనుంది. ఇందులో ఒకటి XG హైబ్రిడ్ MX, హైబ్రిడ్ MZ పేరుతో విడుదల కానున్నాయి. వీటిలో మొదటికి మైల్డ్ హైబ్రిడ్ ను కలిగి ఉంటుంది. కొత్త స్విప్ట్ లో అల్లాయ్ వీల్స్, ఎల్ ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్స్ ఆకర్షిస్తాయి. ఆ తరువాత స్పెషిఫికేషన్ కూడా ఆకర్షించే అవకాశం ఉంది.

    స్పెషిషికేషన్ విషయానికొస్తే.. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ 3 సిలిండ్ హైబ్రిడ్ ఇంజిన్ ను కలిగి ఉంది. 85 బీహెచ్ పీ పవర్ , 168 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. పాత స్విప్ట్ కంటే కొత్త దానిలో హైబ్రిడ్ ఇంజిన్ ఆకట్టుకునే అవకాశం ఉంది. 2024 స్విప్ట్ ఇన్నర్ స్పేస్ ను కూా పెంచారు. బ్లాక్ అండ్ వైట్ డ్యూయెల్ టోన్ థీమ్, కొత్తరకమైన డ్యాష్ బోర్డు, స్టాండింగ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ తో పనిచేస్తుంది. ఏసీ కంట్రోల్ తో పాటు వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆపిల్ కార్ ప్లే ఈ మోడల్ లో కనిపిస్తాయి.

    స్విప్ట్ కు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఇదే మోడల్ ను అప్డేట్ ఫీచర్స్ తో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. 2023 ఏడాది కార్ల అమ్మకాల్లో స్విప్ట్ నెంబర్ వన్ గా నిలిచింది. కొత్త స్విప్ట్ ను కూడా వినియోగదారులు ఆదరిస్తారని అంటున్నారు. అయితే ఈ మోడల్ ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.